Site icon HashtagU Telugu

India First Voter: స్వతంత్ర భారత మొదటి ఓటరు కన్నుమూత…!!

First Voter

First Voter

స్వతంత్రభారత తొలిఓటరు శ్యామ్ శరణ్ నేగి శనివారం ఉదయం కన్నమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో నివసిస్తున్నారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. నవంబర్ 2న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన పోస్టల్ బ్యాలేట్ వేశారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని డీసీ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.