ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో నెల రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి పారిపోయారంటూ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు…వారు రాయ్ పూర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరూ చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. తన మామ తమపై అత్యాచారం చేస్తుంటే…మమ్మల్ని రక్షించాల్సిన మా తండ్రి దానిని చూసేవాడు. మాకు నిద్రమాత్రలు ఇచ్చి మాపై నీచమైన పనులు చేయాలంటూ ఒత్తిడి చేసేవాడంటూ..చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అందుకే తాము ఇంట్లో నుంచి పారిపోయినట్లు వారు చెప్పారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఖుర్సిపర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి..తన 15ఏళ్ల కూతురు, 21 ఏళ్ల కూతురు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 25న తన కుమార్తెలు ఇద్దరు కనిపించడం లేదని పోలీసులకు చెప్పారు. వారి కోసం గాలించగా రాయ్ పూర్ బాలికలు కనిపించారు. రాయ్ పూర్ లో వారు ఓ గదిని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. ఇంటి నుంచి ఎందుకు పారిపోయారంటూ పోలీసులు అడగడంతో…జరిగిన విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. మా తండ్రి చేసే అరాచకాలకు మేము విసిగిపోయాము. మా మేనమామ మా పై అత్యాచారానికి పాల్పడేవాడు. దీంతోపాటు మా తండ్రి మాకు రాత్రి నిద్రమాత్లు ఇచ్చి వేధించేవాడని పోలీసులకు తెలిపారు.
తన తల్లికి మతిస్తిమితం లేదని…మేమిద్దరం మా అత్త ఇంట్లో ఉంటూ చదువుకునేవాళ్లం. ఆగస్టు 27 మధ్యాహ్నం అక్క స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన సమయంలో మా అత్త ఇంట్లో లేదు. అప్పుడు మా మేనమామ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఇద్దర్నీ చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక తన తండ్రికి చెబితే..తాను కూడా మేనమామకే సపోర్టు చేశాడు. మాకు నిద్రమాత్రలు ఇచ్చి నీచమైన పనులకు పాల్పడేవారని తెలిపారు. బాలిక వాంగ్మూలాను నమోదు చేసుకున్న పోలీసులు వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.