Importance of Seat Belts : ఈ చిన్న పొరపాటుతో ప్రతీ ఏడాది వేలాది ప్రాణాలు పోతున్నాయి, ఏంటో తెలుసా..!!

బైక్ నడిపేవారికి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో... కారులో ప్రయాణించే వారికి సీటు బెల్ట్ పెట్టుకోవడం అంతే ముఖ్యం.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 07:00 PM IST

బైక్ నడిపేవారికి హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో… కారులో ప్రయాణించే వారికి సీటు బెల్ట్ పెట్టుకోవడం అంతే ముఖ్యం. ప్రభుత్వం కూడా సీటు బెల్టు పెట్టుకోవాలని ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజలు మాత్రం దీన్ని విస్మరిస్తున్నారు. కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు విషయంలో దారుణంగా వ్యవహారిస్తున్నారు. 90 శాతానికి పైగా ప్రజలు వెనుక సీట్లో బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలిగొట్టుందనడానికి ఉదాహరణ టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్‌ పెండోలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ చర్చకు మళ్లీ ఊతమిచ్చింది. కారు వెనుక సీటులో కూర్చున్న మిస్త్రీ, బెల్టు పెట్టుకోలేదని, ఇదే ఆయన ప్రాణం మీదకు తీసుకువచ్చిందని విచారణలో తేలింది.

వెనుక సీటు బెల్ట్ ప్రాణాలను కాపాడుతుంది:
కారులో వెనుక సీటులో సీటు బెల్టు పెట్టుకోవాలనే నిబంధనను పాటిస్తే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను 25 శాతం వరకు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెనుక సీటుకు బెల్ట్ పెట్టుకోని వ్యక్తులు కొన్నిసార్లు ముందు సీట్లో కూర్చున్న వారికి ప్రమాదకరంగా మారతారు. ప్రమాదం జరిగినప్పుడు, వెనుక కూర్చున్న రైడర్ ముందు కూర్చున్న వారి మరణానికి కారణమయ్యే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

సీటు బెల్ట్‌లో వాస్తవం ఏమిటో తెలుసుకోండి:
1. సీటు బెస్ట్‌కు సంబంధించిన చట్టంపై కేవలం 27 శాతం మందికి మాత్రమే అవగాహన ఉందని ఓ సర్వేలో తేలింది.
2. వెనుక సీట్లో కూర్చున్నప్పుడు కేవలం 7 శాతం మంది మాత్రమే సీటు బెల్టులు ధరిస్తున్నారు.
3. 2020లో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 15146 మంది ప్రాణాలు కోల్పోయారు.
4. డ్రైవర్ సీటుకు బెల్టు పెట్టుకోని కారణంగా 7810 మంది మరణించారు .
5. ప్యాసింజర్ సీట్లో కూర్చున్నప్పుడు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల 7336 మంది దుర్మరణం చెందారు.

కారు ముందు సీటుకు బెల్ట్ పెట్టకోకుంటే చలాన్ విధిస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వెనుక సీటుకు కూడా బెల్ట్ పెట్టడం తప్పనిసరి అని చాలా తక్కువ మందికి తెలుసు. కేంద్ర మోటారు వాహన నిబంధనలలో దీనికి సంబంధించి ఒక నిబంధనను రూపొందించారు. అయితే దీనిపై అవగాహన కొరవడింది. రోడ్డు భద్రత కోసం పని చేస్తున్న సేవ్ లైఫ్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో కేవలం 7 శాతం మంది మాత్రమే వెనుక సీటులో బెల్ట్ ధరిస్తున్నారని తేలింది. ఈ విషయంలో అవగాహన కూడా ఉండాలి. వెనుక సీటుకు బెల్ట్ పెట్టుకోనందుకు చలాన్ కేసులేవీ నమోదు కావడం లేదు. దీంతో చట్టం తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

సీటు బెల్టులు ధరించకపోవడానికి విచిత్రమైన కారణం
2017లో మారుతీ ఓ సర్వే నిర్వహించగా, సీటు బెల్టు పెట్టుకోకపోవడానికి ప్రజలు వింత కారణాలు చెప్పారు. 17 ప్రధాన నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. నిత్యం సీటు బెల్టు పెట్టుకునే వారు 25 శాతం మంది మాత్రమే ఉన్నారు.
1. 32 శాతం మంది ప్రజలు చలాన్ లేదని నమ్ముతున్నారు కాబట్టి సీటు బెల్టులు పెట్టుకోరు.
2. 27 శాతం మంది సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రతిష్ట మసకబారుతుందని భావిస్తున్నారు.
3. 25 శాతం మంది దీని వల్ల బట్టలు పాడవుతాయని చెప్పారు.
4. 23 శాతం మంది ప్రజలు సీటు బెల్టులు ఎలాంటి రక్షణను ఇస్తుందనుకోవం లేదు.
5. ఎయిర్‌బ్యాగ్ తెరవడానికి బెల్ట్ కూడా చాలా ముఖ్యం
6. ప్రమాదం జరిగినప్పుడు భద్రత కోసం వాహనాలకు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేశారు. ఢీకొన్న వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి, తద్వారా కారులో ఉన్నవారు ముందు ఢీకొనకుండా ప్రాణాలతో బయటపడారు. అయితే, ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారులో ఉన్న వ్యక్తి సీటు బెల్ట్ ధరించకపోతే, ఎయిర్ బ్యాగ్ తెరుచుకోదు. కారులో సీట్ బెల్ట్‌లు ప్రాథమిక భద్రతా ఫీచర్‌గా పరిగణించబడతుంది. కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు ముఖ్యమైతే…ఎయిర్ బ్యాగ్ లు కూడా ప్రాణాలను రక్షిస్తాయి. ఎయిర్ బ్యాగ్ లకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందిచబోతోంది. దీంతో అన్ని కార్లలోనూ ఎయిర్ బ్యాగ్ లు ఉండేలా చర్యలు తీసుకోబోతోంది.