Site icon HashtagU Telugu

Hair Fall: జుట్టు ఎక్కువగా రాలిపోతోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Mixcollage 05 Mar 2024 07 50 Pm 4051

Mixcollage 05 Mar 2024 07 50 Pm 4051

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులుగా ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. జుట్టు రాలిపోవడం పెద్ద సమస్య అనుకుంటే వాటికి తోడు జుట్టు త్వరగా తెల్ల బడటం, చిట్లిపోవడం వంటి సమస్యలు మరింత బాధ పెడుతూ ఉంటాయి. జుట్టు రాలే సమస్యను అధిగమించడానికి చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలా అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఇలా చేయాల్సిందే.

మాములుగా శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చర్మానికి సంబంధించిన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి. గాలిలో తేమ పెరగడంవల్ల జుట్టు పొడిబారడమే కాకుండా చిట్లి పోతుంటుంది. అలాంటప్పుడు హెయిర్ మాస్క్ మంచిది. మందార పువ్వు, వేప, ఉసిరి వంటి ఆయుర్వేద మూలికలతో వీటిని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టిస్తే జుట్టుకు బలం. కొబ్బరినూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. రాసుకునే నూనెను కూడా బాగా వేడిచేసి దాంతో మర్దనా చేసుకోవడం మంచిది. జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఊడిపోకుండా, చిట్లిపోకుండా చూస్తుంది.

ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది శీతాకాలం శరీరం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కచ్చితంగా రోజుమొత్తం మంచినీరు ఎక్కువగా తీసుకుంటుండాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. జుట్టు కుదుళ్లు పొడిబారకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం ఎంతో ప్రధానం. నీరు ఎక్కువగా తీసుకోవడంవల్ల శరీరం హైడ్రేట్ అయి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల జుట్టు డ్రై అవకుండా ఉండటంతోపాటు శరీరం కూడా పగలదు. మంచి ఆహారాన్ని తీసుకుంటుండాలి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఉండాలి. వీటిని క్రమంలో తప్పకుండ తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీనివల్ల ఎటువంటి వ్యాధులు శరీరం దరిదాపుల్లోకి కూడా రావు.