Jan Samarth Portal : మీరు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, ఒక్క క్లిక్‌తో రుణం ఆమోదం..!!

మధ్యతరగతి, దిగువ తరగతుల ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు పథకాలకోసం దరఖాస్తులు చేసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

  • Written By:
  • Publish Date - October 16, 2022 / 05:34 AM IST

మధ్యతరగతి, దిగువ తరగతుల ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు పథకాలకోసం దరఖాస్తులు చేసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క క్లిక్ తో మీరు దరఖాస్తు చేసుకున్న పథకానికి అమోదం వస్తుంది. అయితే మీరు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా రుణం పొందాలనుకుంటే …జన్ సమర్థ్ పోర్టల్ మీకు ఉత్తమమైంది. ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు అర్హులైన పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం ఈ జాతీయ పోర్టల్ లో జూన్ లో ప్రధాని మోదీ ప్రారంభించారు.

జన్ సమర్థ్ పోర్టల్ అనేది ప్రభుత్వ క్రెడిట్ పథకాలను అనుసంధానించే ఒక-స్టాప్ డిజిటల్ పోర్టల్. లబ్ధిదారులను రుణదాతలతో నేరుగా అనుసంధానించే తొలి ప్లాట్‌ఫారమ్ ఇది. ఇది డిజిటల్ ప్రక్రియల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలనుకు ప్రజలకు పూర్తి వివరాలను అందిస్తుంది. ఈ పోర్టల్లో అన్ని లింక్డ్ ప్లాన్స్ కవరేజీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ పోర్టల్ ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే…ఆన్ లైన్ అప్లికేషన్ ఆమోదించడం.

జన్ సమర్థ్ పోర్టల్ ప్రత్యేకత ఏమిటి
మీరు జన్ సమర్థ్ పోర్టల్‌ను ‘ఆల్ ఇన్ వన్ పోర్టల్’ అని కూడా పిలవవచ్చు. మీరు రుణంకోసం దరఖాస్తు చేసుకుంది మొదలు..అది ఆమోదం పొందే వరకు …ఇక్కడ ప్రతీది ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్కీమ్ కింద లోన్ దరఖాస్తు చేసుకున్నట్లయితే..దానికి గురించి ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంటే వినియోగదారుడు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. అనేక చిన్న పెద్ద రుణ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా బ్యాంకులతో అనుసంధానం చేశారు. వారు దరఖాస్తుదారుల దరఖాస్తును పరిశీలించి రుణాన్ని ఆమోదిస్తారు.

అలాంటి సౌకర్యాలు అందుబాటులో
జన్ సమర్థ్ పోర్టల్‌లో నాలుగు రకాల రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎడ్యుకేషన్ లోన్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోన్, బిజినెస్ యాక్టివిటీ లోన్, లైవ్లీహుడ్ లోన్ ఉన్నాయి. ప్రతి రుణ విభాగంలో వివిధ పథకాలను చేర్చారు. మీరు ఏ కేటగిరీ కింద రుణం పొందాలనుకుంటున్నారో మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు కోరుకున్న కేటగిరిపై క్లిక్ చేసినప్పుడు..మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఈ ప్రశ్నలలో, రుణం తీసుకునే ఉద్దేశ్యం, పేరు, చిరునామా, ఎంత రుణం కావాలి మొదలైన సమాచారం ఉంటుంది. ఈ సమాధానాలన ద్వారానే లబ్ధిదారుడు ఏదైనా పథకం కింద రుణం పొందవచ్చా లేదా అనేది తెలుస్తుంది.

ఏ పత్రాలు అవసరం?
లోన్ పొందేందుకు సాధారణంగా ఓటర్ ఐడీ, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆధార్ నంబర్ వంటి కీలక పేర్లు ఉంటాయి. మీరు లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఈ పత్రాలను అందించాలి.

మీ రుణ స్థితిని ఎలా తనిఖీ చేయాలి:
జన్ సమర్థ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం మాత్రమే కాకుండా, మీరు దాని ద్వారా మీ దరఖాస్తు స్టేటస్ ను కూడా చెక్ చేయవచ్చు. అర్హులైన పౌరులందరూ దీని ద్వారా ప్రభుత్వ క్రెడిట్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం లభిస్తుందా లేదా అనేది అర్హత ఆధారంగా నిర్ణయిస్తారు. మీ లోన్ ఏ దశలో ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని కోసం, దరఖాస్తుదారు రిజిస్ట్రేషన్ తర్వాత సైన్-ఇన్ చేయాలి. మీ లోన్ స్టేటస్ తెలుసుకునేందుకు డ్యాష్‌బోర్డ్‌లోని మై అప్లికేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.