Best Gold Scheme : బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఈ గోల్డ్ స్కీంతో ఊహించని లాభం…ఎలాగంటే..!!

బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనేది ప్రతీఒక్కరి కల. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ ఆదుర్ధా మరింత ఎక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 10:00 AM IST

బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనేది ప్రతీఒక్కరి కల. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ ఆదుర్ధా మరింత ఎక్కువగా ఉంటుంది. కూలీపనులు చేసుకునేవారి నుంచి కోటీశ్శరుడి వరకు బంగారంలో మదుపు అనేది ఓ సెంటిమెంట్. గోల్డ్ స్కీంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను ఎలా పొందవచ్చో ఓ సారి ఆలోచించాలి. మార్కెట్లో ఉన్న గోల్డ్ స్కీంలలో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవాలి. అయితే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీంతో ఇప్పుడు మీరు డిజిటల్ రూపంలోనూ బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

RBIకొత్త సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ను ప్రారంభించింది. ఒక గ్రాముకు కనీసం రూ. 5147 ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం అంటే ఏమిటి..?
2015లో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ ని ప్రారంభించింది. బంగారంను బిస్కెట్లు లేదా బంగారు నాణేల రూపంలో లేదా ఆభరణాల రూపంలో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. రిజర్వ్ బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్ ప్రతి టర్మ్ కు గ్రాముకు ఇష్యూ ధరను నిర్ణయిస్తుంది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసినట్లయితే ఒక్కగ్రాముకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను ఆఫ్ లైన్ కానీ ఆన్ లైన్లో కానీ కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లను స్టాక్ హెల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీులు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ద్వారా విక్రయిస్తారు.

ఎలాంటి లాభం ఉంటుంది?
1. సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెడితే..హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే…ప్రతి ఏటా 2.5శాతం వడ్డీ లభిస్తుంది. ఇది ప్రతి 6నెలలకు చెల్లిస్తారు.

2. సావరిన్ గోల్డ్ బాండ్ లో పెట్టుబడి పెట్టేందుకు 8ఏళ్ల మెచ్యూరిటీ ఉంటుంది. లాన్ ఇన్ వ్యవధి కాలం 5ఏళ్లు ఉంటుంది. మీరు మెచ్యూరిటీ వరకు సావరిన్ గోల్డ్ బాండ్ కలిగి ఉంటే…పెట్టుబడిపై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

3. ఈ స్కీంలోపెట్టుబడి పెడితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ లో దొంగతనం, బంగారం స్వచ్చత, సేఫ్ లాకర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

4. గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బార్ కోసం జీఎస్టీ చెల్లించినట్లే..సావరిన్ గోల్డ్ బాండ్ లో జీఎస్టీ ఉండదు. కానీ మీరు డిజిటల్ బంగారం కొనుగోలు చేసినప్పుడు 3శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు.

5. ఇక నగదు రూపంలో చెల్లించాలంటే…డిమాండ్ డ్రాఫ్ట్ , చెక్ లేదా ఇ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఆన్ లైన్లో చెల్లిస్తే గ్రాము బంగారంపై రూ. 50 తగ్గింపు వస్తుంది.

ఈ సావరీన్ బాండ్ సిరీస్ ను ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని సిరీస్ ల వారీగా జారీ చేస్తారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ బ్యాంకుల నుంచి వీటిని పూర్తి వివరాలు తెలసుకొని పెట్టుబడి పెట్టవచ్చు.