Site icon HashtagU Telugu

Tourist VISA: ఆ దేశంలో హోటల్ బుకింగ్ చేసుకుంటే ఆరు నెలల వరకు టూరిస్ట్ వీసా

If You Book A Hotel In That Country, You Will Get A Tourist Visa For Up To Six Months.

If You Book A Hotel In That Country, You Will Get A Tourist Visa For Up To Six Months.

రష్యా ప్రభుత్వం తాజాగా కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై 19 దేశాలకు హోటల్ బుకింగ్స్ ఆధారంగా టూరిస్ట్ వీసాలను (Russia Tourist Visa) జారీ చేయనుంది. ఆ జాబితాలో భారత్ ఉండటం గమనార్హం. దీంతో భారతీయులు త్వరలో రష్యాలో పర్యటించాలనుకుంటే ముందుగా హోటల్ బుకింగ్స్ చేసుకుంటే తేలిగ్గా టూరిస్ట్ వీసా వచ్చే అవకాశం ఉంది.  భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కువైట్, లావోస్, మలేషియా, మెక్సికో, మయన్మార్, ఒమన్, సౌదీ అరేబియా,సెర్బియా, థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ వంటి 19 దేశాలకు ఈ కొత్త వీసా విధానం అమల్లోకి రానుంది. దీంతో ఈ దేశాల పర్యాటకులు ఇకపై హోటల్ రిజర్వేషన్ చేసుకుంటే దాని ఆధారంగా ఆరు నెలల వరకు ఈజీగా టూరిస్ట్ వీసాను (Tourist Visa) పొందే వీలుంది. కాగా, రష్యా కొద్ది రోజుల క్రితమే 11 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందించడంతో పాటు భారత్‌ సహా కొన్ని దేశాలకు పర్యాటక వీసా అవసరాలను సులభతరం చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లో ఈ కొత్త వీసా విధానాలను ఆమెదించడం విశేషం. మరోవైపు త్వరలో ఇంకో 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

రష్యాను సందర్శించాలనుకుంటే:

మీరు వేసవి కాలంలో (జూన్ నుండి ఆగస్టు వరకు) రష్యాను సందర్శించాలనుకుంటే.. సైబీరియాలోని బైకాల్ సరస్సును మీ ప్రయాణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ సమయంలో బైకాల్ సరస్సు చాలా అందంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలు మంచి పిక్‌నిక్ స్పాట్లుగా, వీకెండ్ టూర్లుగా, డే టూర్లుగా ఉంటాయి. అలాగే అక్కడ హైకింగ్, క్యాంపింగ్ కూడా చేసుకునే వీలుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద, పురాతనమైన, లోతైన మంచినీటి సరస్సుగా పేరుగాంచింది. దీంతో ఇది తప్పక చూడాల్సిందే. అలాగే, రష్యాలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటైన సోచి నగరం కూడా సందర్శించడానికి గొప్ప‌గా ఉంటుంది. సోచి సాంస్కృతికంగా గొప్ప నగరం. అది రష్యా హస్త కళలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే జూన్ 27 నుండి జూలై 2 వరకు అక్కడ జానపద హస్తకళల ప్రదర్శన జరగనుంది. దీంతో ఈ నగరాన్ని కూడా మీరు చూసిరావచ్చు.

Also Read:  Blood: ఈ ఆహార పదార్థాలు తింటే మీ రక్తం శుద్ధి అవుతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా పెరుగుతుంది