IDBI BANK : కేంద్రం విక్రయించబోయే బ్యాంకుకు వందలకోట్ల లాభాలు..!!

IDBI బ్యాంకులో తన వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతోన్న తరుణంలో ఊహించని పరిమాణం ఎదురైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు లాభాల బాటలో నిలిచింది.

  • Written By:
  • Updated On - October 23, 2022 / 10:02 AM IST

IDBI బ్యాంకులో తన వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతోన్న తరుణంలో ఊహించని పరిమాణం ఎదురైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు లాభాల బాటలో నిలిచింది. దీంతో బ్యాంకు ఎన్ పీఏ కూడా మెరుగుపడింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో కలిసి కేంద్రం ఐడిబిఐ బ్యాంక్ ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ బ్యాంకు 46శాతం నికర లాభం 828.09కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ లాభం రూ. 567.12కోట్లు.

నికరవడ్డీ ఆదాయం, సంపాదించిన వడ్డీ, ఖర్చు చేసిన వడ్డీ మధ్య వ్యత్యాసం 47.7శాతంగా పెరిగి…రూ. 2,738కోట్లకు చేరుకుందని బ్యాంక్ తన బిఎస్ఇ ఫైలింగ్ లో వెల్లడించింది. బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 135బేసిస్ పాయింట్లు పెరిగి 4.37శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం బ్యాంకు ఆదాయం రూ. 6,065.51కోట్లకు పెరిగిందని స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో బ్యాంక్ పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. 5,129.92 కోట్లు ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో బ్యాంక్ నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ స్థితి మెరుగుపడింది.

ప్రభుత్వం వాటా
ఐడిబిఐ బ్యాంక్ కోసం ప్రభుత్వం ఈఓఐలను ఆహ్వానించింది. ఈ బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు శ్రీరామ్ గ్రూపు ఆసక్తి చూపింది. జూన్ 30, 2022నాటి డేటా ప్రకారం…ప్రస్తుతం ఈ బ్యాంకులో కేంద్రం వాటా ఎల్ఐసీ వాటా 94.72శాతం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 45.48శాతంగా కాగా ఎల్ఐసీ వాటా 49.24శాతంగా ఉంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో 2021లో బడ్జెట్ లో ఐడీబీఐ బ్యాంక్ తోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కోవిడ్ సంక్షోభం కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 65.000కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. పెట్టుబడుల విషయంలో వెనకబడటంతో దాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనేక కంపెనీలలో వాటాలను విక్రయిస్తోంది.