Iconic Cable : కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి…ఏపీ, తెలంగాణ కలుపుతూ…!!

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను దేశంలో కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 08:43 AM IST

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను దేశంలో కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలుపుతూ కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణ, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రూ. 1082.56కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కేవలం 30 నెలల్లోనే దీన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన నమూనా ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు నితిన్ గడ్కరీ.

కాగా దేశంలోనే ఇది తొలి కేబుల్ కమ్ సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జి. ప్రపంచంలోనే చారిత్రాత్మక బ్రిడ్జిగా నిలుస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐకానిక్ బ్రిడ్జి…పొడవైన గాజు నడడానికి నడక మార్గం, పైలాన్ వంటి గోపురం, సిగ్నేచర్ లైటింగ్, నావిగేషన్ స్నాన్ వంటి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. చుట్టూ అడవులు, ఎత్తైన పర్వతాలు, విశాలమైన శ్రీశైలం రిజర్వాయర్ తో వాతావరణం ఆహ్లదాకరంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతికి 80కిలోమీటర్లు తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి నేరుగా వెళ్లిపోవచ్చు.