IAS అధికారి అథర్ అమీర్ ఖాన్, అతని భార్య డాక్టర్ మెహ్రీన్ ఖాజీకి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మెహ్రీన్ ఈ రొమాంటిక్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దిల్ యే మేరా తేరే దిల్ సే జ మిలా హై అనే పాటకు ఎంతో రొమాంటిక్ గా కనిపించిది ఈ జంట. ఇన్ స్టాలో వీడియోను షేర్ చేస్తూ చక్కటి క్యాప్షన్ జోడించారు. మీరు సరైన వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఈ పాట మీకు అర్థమవుతుందంటూ లవ్ ఏమోజీని జత చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 28వేలకు పైగా లైక్ లు వచ్చాయి. వందలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.
కాగా అథర్, మెహ్రీన్ ఇద్దరూ కూడా కశ్మీర్ నివాసితులు. మెహ్రీన్ వైద్యురాలుగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అథర్ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అథర్ అమీర్ ఖాన్ కు ఇది రెండో పెళ్లి. మొదటి వివాహం ఐఎఎస్ అధికారిణి టీనా దాబీతో జరిగింది. అయితే వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. విడాకులు తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం టీనా దాబీ కూడా రెండో పెళ్లి చేసుకుంది.