Site icon HashtagU Telugu

Army Soldiers: ఆర్మీ జవాన్ల మానవత్వం.. గర్భిణిని 14 కిలోమీటర్లు మోసి, ఆస్పత్రికి తరలించి!

Army

Army

జమ్మూ-కశ్మీర్‌లో ఆర్మీ జవాన్లు (Army Soldiers) మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 14 కి.మీ.మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. ఖారీ ప్రాంతంలోని హర్గం అనే గ్రామంలో ఓ కుటుంబం, ఆ గ్రామ సర్పంచ్‌ నుంచి ఆర్మీకి (Army Soldiers) మెడికల్‌ ఎమర్జెన్సీ కాల్‌ వచ్చింది. ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చారు.

మంచుతో రోడ్లు జారుడుగా ఉన్నాయి. దీంతో జవాన్లు (Army Soldiers) దాదాపు 6 అడుగులు ఉన్న మంచులో 6 గంటల పాటు శ్రమించి మహిళను 14 కి.మీ.స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ బృందం అంబులెన్స్‌ను (Ambulance) సిద్ధంగా ఉంచింది. దీంతో గర్భిణిని సురక్షితంగా బనిలాల్‌లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి బంధువులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version