Honeyguide : ఏఐ బర్డ్ కాదు.. ‘హనీ’ బర్డ్.. తేనె తుట్టెల అడ్రస్ చెబుతుంది

మనం ‘హనీ గైడ్’(Honeyguide) పక్షి గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఇండికేటర్‌ బర్డ్‌ అని కూడా పిలుస్తారు.

Published By: HashtagU Telugu Desk
Honeyguide Birds Honey Bees Indicator Birds Honey Birds 

Honeyguide : తేనెను సేకరించాలంటే అడవిలోని తేనె తుట్టెలను ఓపిగ్గా వెతకాలి.  అవి ఏ కొండకు, ఏ గుట్టకు, ఏ చెట్టుకు ఉన్నాయనేది కనిపెట్టాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. అయితే ఒక పక్షి దొరికితే మాత్రం.. ఈ కష్టమంతా తప్పుతుంది. తేనె తుట్టెలు ఎక్కడున్నాయో స్వయంగా ఆ పక్షే చూపిస్తుంది. దాని విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Betting Apps : బెట్టింగ్‌ యాప్స్ వ్యవహారం.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై ఫిర్యాదు

‘హనీ గైడ్’ గురించి.. 

  • మనం ‘హనీ గైడ్’(Honeyguide) పక్షి గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఇండికేటర్‌ బర్డ్‌ అని కూడా పిలుస్తారు.
  • ఈ పక్షి  తేనె తుట్టెల లొకేషన్‌ను చూపిస్తుంది. అందుకే దీనికి హనీ గైడ్ అనే పేరు వచ్చింది.
  • ఈ పక్షి ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, మొజాంబిక్‌ అడవుల్లో కనిపిస్తుంది.
  • ఆఫ్రికా అడవుల్లో నివసించే గిరిజన, ఆదివాసీలకు హనీ గైడ్ పక్షితో  ప్రత్యేక అనుబంధం ఉంటుంది.
  • ఈ పక్షి ఒక్కో సందర్భంలో ఒక్కోలా అరుస్తుంది. ఈ అరుపులను బట్టి అదేం చెబుతోందో మనం అర్థం చేసుకోవచ్చు.
  • టాంజానియా, కెన్యా, మొజాంబిక్‌ అడవుల్లోని ఎంతోమంది గిరిజనులు, ఆదివాసీలు తేనెను సేకరించి, విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. ఈక్రమంలో వారికి  హనీ గైడ్‌ పక్షి సహాయం చేస్తుంది. తేనె తుట్టెలు ఎక్కడున్నాయో చూపిస్తుంది.
  • హనీ గైడ్ పక్షి అరుపులను తేనె సేకరించేవాళ్లు వెంటనే పసిగడతారు. తేనెతుట్టె లొకేషన్‌ను గుర్తించి, వెంటనే దానికి పొగ పెట్టి తేనెటీగలను తరిమేస్తారు. దాని నుంచి తేనెను సేకరిస్తారు.
  • తమకు తేనెతుట్టెను చూపించినందుకు హనీ గైడ్‌కు అందులోని మైనాన్ని వదిలేస్తారు.కొన్ని శతాబ్దాలుగా ఇదే పద్దతిని ఆయా అడవుల్లోని గిరిజనులు, ఆదివాసీలు ఫాలో అవుతున్నారు.
  • హనీ గైడ్ పక్షులతో టాంజానియా, కెన్యా, మొజాంబిక్‌ అడవుల్లోని గిరిజన, ఆదివాసీలకు ఉన్న సంబంధంపై పలువురు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు.  ఆ పక్షితో సంభాషించేందుకు అవసరమైన సంకేతాలను అక్కడి గిరిజనులు నేర్చుకున్నారని రీసెర్చ్‌లో వెల్లడైంది.
  Last Updated: 23 Mar 2025, 03:00 PM IST