Site icon HashtagU Telugu

Bihar : ముజఫర్‌పూర్‌లో హిజాబ్ పై కలకలం…ఉపాధ్యాయుడు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ..!!

Hijab Row 7 Teachers Suspended

Hijab Row 7 Teachers Suspended

బీహార్ లోని ముజఫర్ పూర్ హిజాబ్ విషయం కలకలం రేపింది. ఆదివారం ఓ పరీక్ష సందర్బంగా హిజాబ్ ను తొలగించేందుకు విద్యార్థిని నిరాకరించింది. దీంతో ఉపాధ్యాయుడు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ విద్యార్థిని ఆరోపించింది. ఓ ప్రముఖ వార్త సంస్థ ప్రకారం…మహంత్ దర్శన్ దాస్ మహిళా కళాశాలో ఇంటర్మిడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షకు ఓ విద్యార్థిని హిజాబ్ ధరించి వచ్చింది. హిజాబ్ ను తొలగించాలంటూ ఉపాధ్యాయులు అడగడంతో విద్యార్థిని నిరాకరించింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆ విద్యార్థిని పోలీసులకు సమాచారం అందించింది.

అయితే ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..విద్యార్థిని హిజాబ్ తొలగించమనలేదని…బ్లూటూత్ పరికరం ఉందన్న అనుమానంతోనే చెవులు చూపించమని అడిగామని వివరణ ఇచ్చారు. చాలామంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్తున్నారన్న అనుమానంతో విద్యార్థులను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆ విద్యార్థినికి ఏదైనా సమస్య ఉంటే కళాశాల కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయాలని కానీ…పోలీసులకు సమాచారం అందించడం సరికాదని మండిపడ్డారు. ఇదంత కొంతమంది స్థానిక సంఘ వ్యతిరేక వ్యక్తులు ఈవిధంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే విద్యార్థిని వాదన మరోలా ఉంది. హిజాబ్ తొలగించనందుకు తనను దేశద్రోహి అన్నారని..పాకిస్తాన్ వెళ్లాలని ఉపాధ్యాయుడు దూషించాడని ఆరోపించింది. కాగా పరీక్ష ప్రారంభం కాగానే వివాదం జరిగిందని..సమస్యను పరిష్కరించి పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని పోలీస్ అధికారి తెలిపారు.