Site icon HashtagU Telugu

Rathnagiri Tourism : టూరిజం స్పాట్ `ర‌త్న‌గిరి`

Ratnagiri

Ratnagiri

రాయ‌లసీమ గోల్కొండ‌గా ర‌త్న‌గిరి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అక్క‌డి పాల బావిని చూసేందుకు జ‌నం క్యూ క‌డుతున్నారు. దశాబ్దాలుగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో బోరు బావులు, బావులు ఎండిపోయినప్పటికీ పాల బావి మాత్రం నీళ్ల‌తో ఉంటుంది. అక్క‌డికి వ‌చ్చే భక్తులు సాంప్రదాయ ఆచారాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ తగినంత నీరు ఉండ‌డం పాల‌ బావి విశేషం.

స‌త్య‌సాయి జిల్లాలోని రోళ్ల మండలంలో ఉన్న కోటలో ప్రత్యేకమైన నిర్మాణాల కారణంగా సీమ గోల్కొండగా రత్నగిరిని పిలుస్తారు. చాలా కాలం పాటు నిర్లక్ష్య దశలోనే ఉండిపోయింది. చారిత్రాత్మక కోట, ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. పాండ్యన్ చోళ రాజవంశాల కాలం ఆ తరువాత హైదర్ అలీ చేతుల్లో చారిత్రక ప్రాముఖ్యత క‌ట్ట‌డంగా ఉంది. ఏపీ, కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఈ కోట ఉంది.

నిధుల కోసం త‌వ్వ‌కాలు జ‌రిపే వాళ్ల నుండి అటువంటి స్మారక చిహ్నాలను రక్షించడానికి స్థానిక వాలంటీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత, శ్రీ కృష్ణ దేవరాయల పాలనలో ప్రసిద్ధ కవి అల్లసాని పెద్దన అనేక బ్రాహ్మణ కుటుంబాలతో పాటు రత్నగిరికి వలస వచ్చారని చెబుతారు. అందుకే రత్నగిరి కోట గుప్త నిధులకు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కొండలపై ఉన్న ఈ కోటలో పర్యాటకులు, పరిశోధకులను ఆకర్షించే వివిధ రకాల ఆకర్షణలు, నిర్మాణాలు ఉన్నాయి. చరిత్రకారులు రత్నగిరిని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అధికారిక గుర్తింపును కోరుతున్నారు. కానీ, అర్జీలు కాగితాలపైనే మిగిలిపోయాయి. గ్రామస్తులతో కలిసి రత్నగిరి స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి కొంద‌రు ప్రయత్నాలు చేస్తున్నారు. కోటలోని ఒక పెద్ద కల్యాణి (ఈత కొల‌ను పేరు) సంరక్షణ కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది రాణి కోసం ఈత కొలనుగా నిర్మించబడింది. రాణుల స్నాన ప్రదేశంలో శ్రీకృష్ణుడి బృందావనం కూడా ఉంది. ఆమె స్నానం చేసిన వెంటనే పూజలు చేస్తుంది.

రత్నగిరి ఛారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లు మరో ‘కళ్యాణి’ని వెలుగులోకి తెచ్చారు. ఐదు శతాబ్దాల నాటి పాల బావి ని ఏడాది క్రితం తెలుసుకున్నారు. కొల్లాపురమ్మ అమ్మవారి ఆలయ భక్తులకు వినియోగించేందుకు సిల్ట్ తొలగించి బావిని శుభ్రం చేసి వినియోగించారు. రాయ‌ల‌సీమ‌లోని ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల్ని ఆక‌ర్షిస్తోంది.

Exit mobile version