Credit Card: క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌ లను ఇలా ఉపయోగించుకోండి

వినియోగదారులకు అత్యసవర సమయాల్లో నగదు అందుబాటులో లేనప్పుడు క్రెడిట్‌ కార్డ్‌లు ఉపయోగపడతాయి.

కరోనా సమయంలో యూపీఐ ట్రాన్సాక్షన్‌లు (UPI Transactions), క్రెడిట్‌ కార్డ్‌ల (Credit Card) వినియోగం విపరీతంగా పెరిగింది. వినియోగదారుల ఖర్చులు, షాపింగ్ విధానాల సహా చాలా అంశాల్లో మార్పులు వచ్చాయి. 2022 సెప్టెంబరులో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్‌ రికార్డు స్థాయిలో రూ.1.22 లక్షల కోట్లకు చేరిందని నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్‌ పెరగడంతో ఆయా బ్యాంకులు కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేస్తున్నాయి. వినియోగదారులకు అత్యసవర సమయాల్లో నగదు అందుబాటులో లేనప్పుడు క్రెడిట్‌ కార్డ్‌లు ఉపయోగపడతాయి. ఇన్‌స్టంట్‌గా పేమెంట్స్‌ చేయవచ్చు. అంతే కాకుండా క్రికెట్‌ కార్డ్‌ల ద్వారా ఇతర బెనిఫిట్స్‌ చాలా ఉన్నాయి. గిఫ్ట్‌లు, బెనిఫిట్స్‌, డిస్కౌంట్‌లు, ఇతర డీల్స్‌, షాపింగ్, డైనింగ్, బిల్ పేమెంట్స్‌, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌, ట్రావెలింగ్‌ సహా వివిధ కేటగిరీలలో చేసిన కొనుగోళ్లకు పాయింట్‌లు అందించే రివార్డ్ ప్రోగ్రామ్‌లతో ప్రయోజనాలు అందుతాయి. క్రెడిట్‌ కార్డ్‌ (Credit Card) ద్వారా ఖర్చు చేస్తున్నప్పుడు వివిధ రకాల రివార్డ్‌ల కోసం రీడీమ్ చేయగల పాయింట్‌లు లభిస్తాయి. క్రెడిట్‌ కార్డ్‌ల నుంచి అధిక ప్రయోజనాలు ఎలా పొందాలో? ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్‌ కార్డ్ (Credit Card) టైప్‌ ఆధారంగా ప్రయోజనాలు:

అనేక బ్యాంకులు, మెర్చంట్స్‌, ఫిన్‌టెక్ కంపెనీలు కస్టమైజ్డ్ కార్డ్‌లతో పాటు ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డ్‌లతో వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బేస్‌లైన్ నుంచి ప్రీమియం ఆఫర్‌ల వరకు – కార్డ్ రకాన్ని బట్టి రివార్డ్ పాయింట్‌ల విలువ మారుతుంది. పాయింట్‌ల రీడెంప్షన్ బ్యాంకు నుంచి బ్యాంకుకు వేరుగా ఉంటుంది.

కార్డ్‌ని స్వైప్ చేసిన ప్రతిసారీ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లు ఆటోమేటిక్‌గా జమ అవుతాయి. కొనుగోలు విలువ ఎంత ఎక్కువగా ఉంటే, అన్ని ఎక్కువ పాయింట్లను పొందుతారు. పాయింట్ల సంఖ్య కార్డ్ రకం, జారీ చేసే బ్యాంక్ ఆధారంగా మారుతుంది. MakeMyTrip ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి కో-బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ సాధారణ క్రెడిట్ కార్డ్ కంటే విమాన, హోటల్ బుకింగ్‌లపై ఎక్కువ పాయింట్లను అందిస్తుంది.

రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలను ఎలా పెంచుకోవాలి?

క్రెడిట్ కార్డ్ పొందిన మొదటి 90 రోజులలోపు డబ్బు ఖర్చు చేస్తే, కొన్ని బ్యాంకులు వెల్‌కం పాయింట్లను అందిస్తాయి. పార్టనర్ స్టోర్‌లలో షాపింగ్ చేయడం, డైనింగ్, ఎంటర్‌ట్రైన్‌మెంట్‌ వంటి నిర్దిష్ట కేటగిరీలలో ఖర్చు చేయడం వల్ల యాగ్జలరేటెడ్‌ రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. మెరుగైన స్పెండింగ్‌ డెసిషన్స్‌ కోసం ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. సెలవు సీజన్‌లో ఇ-వోచర్‌లు లేదా గిఫ్ట్‌ కార్డ్‌ల కోసం పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు. కార్డ్ జారీచేసేవారి రివార్డ్‌ల పోర్టల్‌లో అనేక రకాల కేటగిరీల ద్వారా షాపింగ్ చేయవచ్చు. రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్‌ ద్వారా విమాన ఛార్జీలు, హోటల్ బుకింగ్‌పై ఆదా చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్ల ద్వారా విరాళాలు అందించే అవకాశాన్ని కూడా అందిస్తాయి.

పాయింట్ల గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల గడువు ముగిసేలోపు వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా బ్యాంకులు ట్రాకింగ్ పాయింట్‌ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందిస్తాయి. యాన్యువల్‌ లిమిట్‌ను దాటి ఖర్చు చేస్తే అదనపు రివార్డ్‌లను అందించే కొన్ని కార్డ్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. రివార్డ్‌లను పెంచుకోవడానికి ఒకటి లేదా రెండు కార్డ్‌లపై మాత్రమే కొనుగోళ్లను పరిమితం చేయడం తెలివైన పని.

క్రెడిట్ కార్డ్ (Credit Card) రివార్డ్ పాయింట్ల ప్రయోజనాలు:

హోటల్ బుకింగ్‌, ఫ్లైట్ టిక్కెట్‌, ఛారిటీ కాంట్రిబ్యూషన్‌లకు కార్డ్ హోల్డర్‌లు తమ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇంతకంటే తదుపరి హాలిడే ప్లాన్ చేసుకోవచ్చు. వార్డ్‌రోబ్‌ని సరిచేయవచ్చు లేదా కిరాణా సామగ్రిని నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ బెనిఫిట్స్‌ అందించే క్రెడిట్‌ కార్డ్‌లను సెలక్ట్‌ చేసుకోవాలి. స్మార్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగదారు అయితే, దాని ప్రయోజనాలను అర్థం చేసుకుంటే, క్రెడిట్ కార్డ్‌లు ఖర్చులను నిర్వహించడానికి చక్కగా ఉపయోగపడతాయి.

Also Read:  Mukesh Ambani: ముఖేష్ అంబానీ రాకతో కళగా మారిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్