తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదల కోరకుంటారు. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పిల్లలు చాలా సులభంగా ప్రభావితం అవుతుంటారు. మంచి చెడు మధ్య తేడా అనేది వారికి తెలియదు. అందుకే ఇతరులను అనుసరించడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు క్రమశిక్షణలోకి తీసుకురావడం తల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి వారిలో క్రమశిక్షణను సులభంగా నేర్పించవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం వారికి సరైన పాఠాలు చెప్పడం ముఖ్యం. కొన్నిసార్లు పిల్లలు కూడా చెడు అలవాట్లకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాంటి పరిస్థితిలో పిల్లల ప్రవర్తనలో కొన్ని తప్పులును గమనించడం వల్ల మీరు వారిని క్రమశిక్షణ కిందకు తీసుకురావచ్చు. దానికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
ప్రతిదానికీ పట్టుబట్టడం:
చాలాసార్లు పిల్లలు తమకు కావాల్సింది అందనప్పుడు చాలా గట్టిగా బిగ్గరగా ఏడ్వటం మొదలుపెడతారు. అలాంటి పరిస్థితిలో పిల్లలను నేరుగా దేనికీ తిరస్కరించకుండా…ఆ విషయం ప్రతికూలతలను పిల్లలకు తెలియజేయాలి. వాటి గురించి ప్రేమగా వివరించడానికి ప్రయత్నించండి.
కోపంగా ఉన్నప్పుడు:
మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నట్లయితే..పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం చాలా అవసరం. అలాంటి పరిస్థితిలో చికాకు స్వభావం గురించి పిల్లలను తిట్టడం మానుకోవాలి. అలాగే పిల్లల మంచి అలవాట్లను ఆభినందించాలి. వారితో ప్రేమగా వ్యవహారించాలి.
చెడు ప్రవర్తన గురించి :
కొంతమంది పిల్లలు ఢల్ గా ఉంటారు. పిల్లల ముందు పెద్దలు అనవసరపు విషయాలు మాట్లాడుతుంటారు. అదే సమయంలో పిల్లలు ఆ మాటలు తరచుగా వినడం వల్ల ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంటారు. అందుకే వారి చెడు ప్రవర్తన ప్రతికూలతలను పిల్లలకు చెప్పండి. అలా చేయవద్దంటూ సలహా ఇవ్వండి.
తిట్టకూడదు:
పిల్లలతో కఠినంగా ఉండటం…మాట్లాడేటప్పుడు వారిని తిట్టడం వల్ల మొండిగా మారుతారు. అందుకే పిల్లలు చెడుగా ప్రవర్తించినప్పుడు వారికి ప్రేమతో వివరించండి. అలవాట్లు ఎదుటవారిని బాధపెడతాయని చెప్పే ప్రయత్నం చేయండి.
తప్పును అంగీకరించడం నేర్పించాలి:
పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో మరికొరిపై చాడీలు చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలకు అబద్ధం చెప్పకుండా ఉండటం నేర్పించండి. తప్పును అంగీకరించమని చెప్పండి.