Car Burial Ceremony : చాలామంది లక్కును నమ్ముకుంటారు. సెంటిమెంటును నమ్ముకుంటారు. తమతో ఎమోషనల్‌గా అటాచ్ అయిన వస్తువులు దూరమై పోతుంటే కొంతమంది అస్సలు తట్టుకోలేరు. ఇలాంటి కేటగిరీకి చెందిన ఓ గుజరాతీ ఫ్యామిలీ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
Also Read :Secunderabad : సికింద్రాబాద్ – షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా పదార్‌శింగా గ్రామం అది. ఆ ఊరిలో సంజయ్ పోలారా అనే రైతు ఉంటాడు. అతడి కుటుంబం తమ పాత కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఇందుకోసం రూ.4 లక్షల దాకా ఖర్చు పెట్టింది. సంజయ్ ఇంటి నుంచి పొలం వరకు కారుకు భారీ అంతిమయాత్రను నిర్వహించారు. ఇందులో 1500 మందికిపైగా పాల్గొన్నారు. తన పొలంలోనే 15 అడుగుల లోతు గుంతను తవ్వించి.. దానిలో తన కారును(Car Burial Ceremony) సంజయ్ పూడ్చి పెట్టించారు. 12 ఏళ్ల క్రితం ఈ కారును కొన్నానని ఆయన చెప్పారు. గత 12 ఏళ్ల తన జీవితంలో ఆ కారు కూడా ఒక ఎమోషనల్ భాగంగా మిగిలిందని ఆయన తెలిపారు.
Also Read : Surendar Reddy : పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టేసి ఇంకో సినిమాకు రెడీ అవుతున్న డైరెక్టర్..
అందుకే దాన్ని స్క్రాప్‌లో లేదా సెకండ్ హ్యాండ్‌లో అమ్మడానికి మనసు ఒప్పలేదని సంజయ్ పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులతో చర్చించి.. ఆ కారును తమ పొలంలో పూడ్చిపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ కారు గుర్తుకు వచ్చినప్పుడు.. ఇకపై తాము పొలానికి వెళ్లి దాని సమాధిని చూసుకుంటామన్నారు. ఆ కారు తన ఫ్యామిలీకి గౌరవాన్ని, లక్కును సాధించి పెట్టిందని చెబుతూ సంజయ్ ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘మా కారు సమాధి మీద ఓ మొక్కను నాటాం. అది పెరిగి చెట్టుగా మారుతుంది. దాన్ని చూసుకొని మా కారును ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’ అని ఆయన తెలిపారు.