Angry Wife Issue: భార్య కోపం తగ్గించేందుకు లీవ్ లెటర్ రాసిన వ్యక్తి.. వైరల్ లెటర్!

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు భార్యలు చిన్న

  • Written By:
  • Updated On - August 6, 2022 / 10:01 AM IST

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు భార్యలు చిన్న చిన్న విషయాలకి అలుగుతుంటారు. ఇంకొందరు అయితే అలగడమే కాకుండా భర్తలతో మాట్లాడకుండా ఉంటారు. ఆ తర్వాత భార్య కోపం తగ్గిన తర్వాత భర్తలు బుజ్జగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని భార్యని వెళ్లి ఇంటికి తెచ్చుకోవడం కోసం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా ఉన్నత అధికారులకు లీవ్ లెటర్ రాశాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన లీవ్ లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంషాద్ అహ్మద్‌ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి. ప్రేమ్‌నగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో వారి సంసార జీవితం బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అహ్మద్ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అతడి భార్య అలిగి,పిల్లలతో తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

అహ్మద్ కు భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఆమె విలువ తెలిసి వచ్చింది. ప్రతిరోజు ఇంటి పని మొత్తం చేసుకుని ఆఫీస్ కి వెళ్లేసరికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే విషయం పట్ల అహ్మద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన లీవ్ లెటర్ లో పేర్కొన్నాడు. చిన్న గొడవ కారణంగా నా భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లినప్పటి నుంచి నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఊరెళ్లాలి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని,లీవ్ లెటర్‌ను ఆమోదించండి అంటూ తన ఉన్నతాధికారికి లెటర్ రాశాడు. ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.