Breast Milk : తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..! భారత్ లో తల్లిపాలు విక్రయం అనుమతించబోమన్న ప్రభుత్వం..!!

శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు తప్ప మరేమీ పట్టవద్దని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే అమ్మపాలలో ఉన్న పోషక విలువు ఇంకోదాంట్లో ఉండవు.

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 04:59 AM IST

శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు తప్ప మరేమీ పట్టవద్దని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే అమ్మపాలలో ఉన్న పోషక విలువు ఇంకోదాంట్లో ఉండవు. బిడ్డ బొజ్జ నింపే తల్లిపాటు ఆ బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బిడ్డ ఎదుగుదలలో సాయపడతాయి. అటువంటి అమ్మపాలను విక్రయిస్తున్నాయి కొన్ని కంపెనీలు. భారత్ లో కంటే అమెరికాలో ఈ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ లో ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తల్లిపాటు విక్రయించినందుకు ఒక కంపెనీపై చర్యలు తీసుకుంది. ఆ కంపెనీ లైసెన్సును కూడా రద్దు చేసింది. దీనిపై ప్రుభుత్వం మరింత కఠినంగా వ్యవహారిస్తోంది. తల్లిపాల నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తే చట్టవిరుద్దమని స్పష్టం చేసింది.

డెయిరీ లైసెన్సు పేరుతో తల్లిపాల విక్రయాల వ్యవహారంలో చాలా కఠినంగా ఉండాలంటూ హెచ్చరించింది. తల్లిపాల పేరుతో ఉత్పత్తులను విక్రయించే కంపెనీల లైసెన్సులు రద్దు చేసిన..చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ లో తల్లిపాల అమ్మకాలను అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. FSSచట్టం 2006లోని నిబంధనలు, నియమాల ప్రకారం అటువంటి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై తగిన చర్యలు తీసుకోబడతాయి.

కాగా ఈ ఏడాదిలో జులైలో (FSSAI)నియెలాక్టా లైఫ్ సైన్సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తల్లిపాలను భారత్ లో విక్రయిస్తోంది. ఈ కంపెనీపై బెంగుళూరుకు చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో (FSSAI) ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. 2016లో నియోలాక్టా కంపెనీని స్థాపించారు. తల్లిపాల విక్రయానికి సంబంధించి కర్నాటక నుంచి లైసెన్సు పొందింది. అయితే ఈ కంపెనీపై భారత్ లో తల్లిపాల విక్రయాలకు అనుమతి లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. తల్లిపాలను నెలలు నిండని లేదా అనారోగ్యంతో ఉన్న శిశువులకు వినియోగిస్తారని కంపెనీ ఎండీ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. కాగా నియోలాక్టా కంపెనీ 300ఎంఎల్ తల్లిపాలకు రూ. 4500రూపాయలు వసూలు చేసింది.