LIC Policy : పాలసీదారులకు శుభవార్త చెప్పిన ఎల్ఐసీ…ఆ స్కీంలపై భారీ తగ్గింపు.!!

కోవిడ్ మహమ్మారి ప్రజల జీవనవిధానాన్నే మార్చేసింది. మనుషుల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్ మహమ్మారి స్రుష్టించిన విలయం అంతాఇంతకాదు.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 11:27 AM IST

కోవిడ్ మహమ్మారి ప్రజల జీవనవిధానాన్నే మార్చేసింది. మనుషుల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్ మహమ్మారి స్రుష్టించిన విలయం అంతాఇంతకాదు. దీని పేరు వింటేనే ప్రజలు వణికిపోయారు. ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయం పట్టుకుంది. కోవిడ్ సోకితే…చేతిలో గవ్వలేకుంటే…ఆసుపత్రుల బిల్లులు ఎలా…? అనే ఆలోచనల్లో పడిపోయారు. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం ప్రారంభించారు. భారతీయ అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు శుభవార్తను అందించింది. ప్రీమియం చెల్లించక నిలిచిపోయిన పాలసీ పునరుద్దరణపై కీలక నిర్ణయం తీసుకుంది ఎల్ఐసీ. ఆయా పాలసీలను మళ్లీ పునరుద్దరించుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

పాలసీని రెన్యూవల్ చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపింది. స్పెషల్ రివైనల్ క్యాంపెయిన్ లో భాగంగా అన్ని నాన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీలు రాయితీతో ఫైన్ చెల్లించి మళ్లీ కొనసాగించుకోవచ్చని ప్రకటించింది.

ఇక ప్రీమియం మొత్తం చెల్లించిన తేదీ నుంచి 5ఏళ్ల లోపు పాలసీలను రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. 1,00,001 నుంచి మూడు లక్షల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉన్నట్లయితే లేట్ ఫైన్ తో 25శాతం తగ్గింపు కూడా వస్తుంది. 3లక్షలకు పైగా ఆ పై ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలకు లేటు ఫీజులో 30శాతం తగ్గింపు ఉంటుంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు అయితే…ఆలస్య రుసుముతో ఉందని తెలిపింది. పలు కారణాలతో ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియం చెల్లించనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది ఎల్ ఐసీ. కాగా ఎల్ఐసీలో ఇప్పటికే ఎన్నో స్కీంలు అందుబాటులో ఉన్నాయి.