Site icon HashtagU Telugu

Bank Fault, Girl Becomes Rich: అకస్మాత్తుగా అకౌంట్లోకి 18 కోట్లు.. నీళ్ళలా ఖర్చు పెట్టేసిన అమ్మాయి!!

Picc Sixteen Nine Imresizer

Picc Sixteen Nine Imresizer

అప్పటిదాకా పొదుపుగా ఖర్చులు చేసిన ఆ అమ్మాయి.. అకస్మాత్తుగా కోట్లు ఖర్చు పెట్టడం మొదలెట్టింది.
లగ్జరీ అపార్టుమెంట్ కూడా కొనేసింది. ఎంత ఖర్చు పెడుతున్నా.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయిపోవడం లేదు.

ఎందుకో తెలుసా?

ఆమె అకౌంట్ కలిగిన బ్యాంక్.. సాంకేతిక తప్పిదం వల్ల అకౌంట్ కు అన్ లిమిటెడ్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇచ్చింది. దానివల్లే ఆమె ఎంత ఖర్చు పెట్టినా అకౌంట్లో డబ్బులు అయిపోలేదు.

ఇలా అన్ లిమిటెడ్ రూ.18 కోట్లు ఖర్చు పెట్టిన ఆ అమ్మాయి పేరు క్రిస్టిన్ జియాక్సిన్. మలేషియాకు చెందిన ఆ యువతి ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేస్తోంది. ఆమె కాలేజీలో జాయిన్ అయ్యే టైం లో westpac bankలో అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ బ్యాంక్ వాళ్ళు పొరపాటున ఆమె అకౌంట్ కు అన్ లిమిటెడ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటి కల్పించారు. 11 నెలల పాటు క్రిస్టిన్ జియాక్సిన్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది. లగ్జరీ వస్తువులు కొనేసింది. టూర్లు చేసి ఎంజాయ్ చేసింది. ఒక అపార్ట్మెంట్ కొనేసింది. విలాసవంతమైన బతుకు బతికింది.

11 నెలల తర్వాత క్రిస్టిన్ జియాక్సిన్ అకౌంట్ బాగోతాన్ని westpac bank గుర్తించింది. ఆమెపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటి ని అక్రమంగా వాడుకొని కోట్లు ఖర్చు చేసిందనే అభియోగాలను క్రిస్టిన్ జియాక్సిన్ పై మోపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
క్రిస్టిన్ పేరిట ఉన్న 9 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. అనంతరం కోర్టులో క్రిస్టిన్ జియాక్సిన్ ను ప్రవేశపెట్టారు. కొసమెరుపు ఏమిటంటే.. కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. రిలీజ్ అయిన అనంతరం ఆమె స్వదేశం మలేషియా కు వెళ్ళిపోయింది. ఇంతకూ క్రిస్టిన్ జియాక్సిన్ ఎందుకు నిర్దోషిగా తేలింది? అనే సందేహం వచ్చి ఉంటుంది కదా!! కోర్టులో క్రిస్టిన్ జియాక్సిన్ మాట్లాడుతూ.. “మా అమ్మా నాన్న నా అకౌంట్లో డబ్బులు వేసి ఉంటారని భావించాను. అందుకే అంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాను” అని చెప్పింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.

Exit mobile version