Site icon HashtagU Telugu

Bank Robbery : 60సెకండ్లలో బ్యాంకును లూటీ చేసిన దండగులు..వైరల్ వీడియో..!!

Bank

Bank

రాజస్థాన్ లో SBI బ్యాంకును 60 సెకండ్లలో లూటీ చేశారు దుండగులు. బ్యాంకు దోపిడికి సంబంధించిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇద్దరు దొంగలు హెల్మెట్ ధరించి తుపాకీతో బ్యాంకులోకి వచ్చారు. బ్యాంక్ సిబ్బందిని పట్టుకుని…క్యాషియర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ క్యాషియర్ కు బ్యాగు ఇచ్చి తుపాకీ ఎక్కిపెట్టారు. దీంతో క్యాషియర్ బ్యాగులో డబ్బులు నింపిన వెంటనే అక్కడి నుంచి ఉడాయించారు. ఈ బ్యాంకు దోపిడికి సంబంధించిన సన్నివేశం మొత్తం బ్యాంకులో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు దుండగులు పట్టుకునే పనిలో పడ్డారు.

https://twitter.com/AhmedKhabeer_/status/1593413754699493376?s=20&t=p8UX2JQj6KqiWfK5VWg9ag

Exit mobile version