Frozen breast milk: అంగట్లో అమ్మపాలు, 300 ML ధర ఎంతో తెలిస్తే షాకవుతారు…!!

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి మంచివి. అప్పుడే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటారు. నవజాత శిశువు తల్లిపాలు తాగినే వారి రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - October 17, 2022 / 02:48 PM IST

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి మంచివి. అప్పుడే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటారు. నవజాత శిశువు తల్లిపాలు తాగినే వారి రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. పిల్లల పెరుగుదలకు తల్లిపాలు అమ్రుతం లాంటివి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా తల్లిపాలకు చాలా డిమాండ్ పెరిగుతోంది. భారత్ లో కూడా జూలైలో లైసెన్స్ రద్దుచేసిన ఒక కంపెనీ తల్లిపాలను విక్రయిచింది. అయితే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ తల్లిపాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తల్లిపాలతో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని FSSAI తెలిపింది. ఫ్రొజెన్ (స్తంభింపచేసిన) తల్లిపాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంత డిమాండ్ పెరుగుతోంది? తెలుసుకుందాం.

భారత్, కంబోడియా, అమెరికా, ఇంగ్లాండ్ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వినియోగం గణనీయంగా పెరిగింది. స్తంభింపచేసిన తల్లిపాల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ పాలలో ఉండే పోషకాల విలువ తగ్గకుండా వాటిని తయారు చేస్తారు. తల్లిపాలలో లభించే పోషకాలకు అదనంగా మరిన్ని పోషకాలను జోడించి విక్రయిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారు, బాడీబిల్డర్లు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారు తల్లిపాల ఉత్పత్తులను తీసుకుంటున్నారు. అంతేకాదు చాలా సందర్భాల్లో తల్లిపాలు ఆరోగ్య సంరక్షణ ప్రదాతల కోసం ఆసుపత్రులకు పంపిస్తుంటారు. ఇంగ్లాండ్ తల్లి పాలల్లో సమస్య ఉన్నవారికోసం ఓ కంపెనీ ఆన్ లైన్ ద్వారా తల్లిపాలను అందిస్తోంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాలకు డిమాండ్ పెరిగింది.

తల్లిపాలను చనమొనపై ఒక షీల్డ్ అమర్చబడి, పాలను మాన్యువల్ గా లేదా ఎలక్ట్రిక్ పంపు సాయంతో తీస్తారు. మార్కెట్లో రకరకాల బ్రెస్ట్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ బ్రెస్ట్ పంపు, బ్యాటరీ ఆపరేటెడ్ బ్రెస్ట్ పంప్, ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, బల్బ్ స్టైల్ బ్రెస్ట్ పంప్ వీటి ద్వారా తల్లిపాలను సేకరిస్తారు. ఉద్యోగం చేసే మహిళలు, సకాలంలో బిడ్డకు పాలు అందేలా సేకరించిన పాలను నిల్వచేసుకోవచ్చు. తల్లిపాలు తీసిన తర్వాత దాదాపు 8రోజులపాటు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయవచ్చు. అయితే వాటిని నాలుగు రోజుల్లోనే వాడాలని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి భద్రత లేకుండా అనధికారికంగా తల్లిపాలను విక్రయించడం ద్వారా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. తల్లిపాలను సంగ్రహించడానికి, నిల్వ చేయడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. వాటిని పాటించనట్లయితే..నవజాత శిశువు కు లేదా పెద్దలకు కూడా హాని కలిగించే వైరస్ లు లేదా బ్యాక్టీరియా పాలలో ఉత్పత్తి అవుతుంది. జర్నల్ ఆఫ్ హెల్త్ పాపులేషన్ అండ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం..స్తంభింపచేసిన తల్లిపాలలో తాజా తల్లిపాలకంటే తక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపింది. తల్లిపాలను భారత్ లో 300ఎంఎల్ 4500రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇంగ్లాండ్ లో అయితే 50ఎంఎల్ పాలు 45పౌండ్లు అంటే 4300రూపాయలకు విక్రయిస్తున్నాయి కంపెనీలు.