$16Billion: దడ పుట్టిస్తున్న కప్పలు, పాములు.. ఆర్ధిక వ్యవస్థకు రూ.1.20 లక్షల కోట్ల నష్టం!!

కప్పలు, పాములే కదా అని తీసి పారియొద్దు. అవి గత 34 ఏళ్లలో ప్రపంచానికి చేసిన నష్టం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు. అవి రెచ్చిపోవడం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు దాదాపు రూ.1.20 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందట.

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 09:15 AM IST

కప్పలు, పాములే కదా అని తీసి పారియొద్దు. అవి గత 34 ఏళ్లలో ప్రపంచానికి చేసిన నష్టం ఎంతో తెలిస్తే నోరెళ్ళబెడతారు. అవి రెచ్చిపోవడం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు దాదాపు రూ.1.20 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ షాకింగ్ విషయం అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఎవరు?

అమెరికన్ బుల్ ఫ్రాంగ్ జాతికి చెందిన కప్పలు..బ్రౌన్ ట్రీ జాతికి చెందిన పాముల కారణంగా ఆర్ధిక వ్యవస్థలకు కనీవినీ ఎరుగని స్థాయిలో చిల్లు పడింది. 1986 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు జరిగిన నష్టాన్ని లెక్కగట్టిన శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు.

పసిఫిక్ దీవుల్లో బ్రౌన్ ట్రీ పాముల ఆగడాలు

శాస్త్రవేత్తల అధ్యయన నివేదిక ప్రకారం.. కేవలం బ్రౌన్ ట్రీ జాతి పాముల వల్లే దాదాపు రూ.81వేల కోట్ల నష్టం చోటుచేసుకుంది.
అనేక పసిఫిక్ దీవుల్లో బ్రౌన్ ట్రీ జాతి పాముల ఆగడాలు శ్రుతి మించాయని పేర్కొన్నారు. అమెరికా జలాంతర్గాములు రహస్య ఆపరేషన్ల కోసం పసిఫిక్ దీవుల్లోని సముద్ర భూగర్భ జలాల్లో చక్కర్లు కొడుతుంటాయి. వాటి ద్వారానే బ్రౌన్ ట్రీ జాతి పాములు
పసిఫిక్ దీవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇవి ఈ ప్రాంతంలోని విద్యుత్ పరికరాలపై పాకుతూ.. అవి పని చేయకుండా చేస్తున్నాయి. దీనివల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై మరమ్మతుల ఖర్చుల భారము తడిసి మోపెడు అవుతోంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దురుద్దేశపూర్వకంగా అమెరికా సైన్యం ఈ పాములను ఇక్కడ వదిలిందని కూడా చెబుతారు. ఈనేపథ్యంలో దాదాపు 20 లక్షలకుపైగా బ్రౌన్ ట్రీ పాములు చిన్నపాటి పసిఫిక్ ద్వీపంలో ఉన్నట్లు ఒక అంచనా.

అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌ లకు కంచె..

ఇక పసిఫిక్ దీవులు, ఐరోపా దేశాల్లో అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌ లు చెలరేగుతున్నాయి. వ్యవసాయానికి పెను నష్టం కలుగజేస్తున్నాయి. దీంతో వీటి సంతానోత్పత్తి ప్రదేశాల చుట్టూ ఖరీదైన ఫెన్సింగ్‌ వేయాల్సి వస్తోందట. కేవలం 5 చెరువులకు కంచె వేయడానికే దాదాపు రూ.2 కోట్లు అయిందట. ఈ కప్పల కదలికలను ఆపేస్తేనే.. పంట నష్టం నుంచి బయటపడుతామని డిసైడ్ అయిన రైతులు ఈవిధంగా అవి సంతానోత్పత్తి చేసే ప్రదేశాల వద్ద ఫెన్సింగ్స్ వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఈ కప్పలను తినేందుకు
విషపూరితమైన పాములను కొని తెచ్చుకొని కొందరు రైతులు పెంచుతున్నారు. ఈవిధమైన చర్యలపై పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ బుల్‌ఫ్రాగ్‌ లకు విరుగుడుగా పాములు పెంచడం సరికాదన్నారు.