Site icon HashtagU Telugu

SAMBHAVAM : మరోసారి హీరో అనిపించుకున్న సోనూ సూద్, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఏం చేశాడంటే..!!

కోవిడ్ సమయంలో సోనూసూద్ చేసిన సేవల గురించి మాటల్లో చెప్పలేం. కష్టకాలంలో లక్షలాది మందికి చేయూతనిస్తూ…దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. గత రెండేళ్ల నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆపదలో ఉన్నవారికి సోనూసూద్ దేవుడిగా మారారు. ఇప్పుడు మరోసారి విద్యార్థుల కోసం సోనూసూద్ ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.

IASకు ప్రీపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కొత్త భారతదేశాన్ని తయారు చేద్దామంటూ ట్వీట్ చేశారు. 2022-23గాను ప్రారంభం కానున్న ఐఏఎస్ పరీక్ష కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. మీరు IASకోసం సిద్ధం అవ్వండి…మీ బాధ్యత మేము తీసుకుంటాము అంటూ మరో ట్వీట్ చేశారు సోనూ సూద్. దియా ఢిల్లీతో కలిసి సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా సంభావం అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పేద, దిగువ స్థాయి వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన విద్యార్థులను సివిల్ సర్వీసెస్ కు సిద్ధం చేయాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి:
ఈ ఉచిత కోచింగ్ లో చేరాలనుకునే విద్యార్థులు సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇందలో ఎంపికైన విద్యార్థులకు దేశంలోని టాప్ సివిల్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్లలో ఉచిత ఆన్ లైన్ కోచింగ్ అందిస్తారు. దీంతో పాటు పౌండేషన్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కూడా అందించనున్నారు.