Skulls: య్యేళ్ల క్రితం పూర్వీకుల పుర్రెలకు రంగులు వేసేవారట.. ఎందుకలా చేసేవారో తెలిసిపోయింది..

1000 సంవత్సరాల కిందటి మాట.. పెరూలోని చించా జాతి ప్రజలు తమ పూర్వీకుల అవశేషాలకు, పుర్రెలకు ఎరుపు రంగు పూసేవారు.

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 07:15 AM IST

1000 సంవత్సరాల కిందటి మాట.. పెరూలోని చించా జాతి ప్రజలు తమ పూర్వీకుల అవశేషాలకు, పుర్రెలకు ఎరుపు రంగు పూసేవారు. స్వయంగా తమ చేతివేళ్ళతో పుర్రెకు ఎరుపు రంగును అద్దేవారు.  ఇది అప్పటి ఆచారమని.. ఇందువల్లే వారు అవశేషాలపై ఎరుపు రంగును పూసేవారని నమ్ముతారు. చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత.. చనిపోయినవారు కొత్త రకమైన సామాజిక జీవితాన్ని పొందుతారని నమ్ముతారు.

చాలామందిని కలిపి చుల్పాస్’లో ..

కొత్త పరిశోధనలో భాగంగా దక్షిణ పెరూలోని చించా లోయలో కనుగొనబడిన వందలాది మానవ అవశేషాలను పరిశోధకులు విశ్లేషించారు.  1000 నుంచి 1825 సంవత్సరాల మధ్యకాలం నాటి అవశేషాలను అధ్యయనం చేశారు. ఇవి 100 కంటే ఎక్కువ ‘చుల్పాస్’లో కనుగొనబడ్డాయి.  చుల్పాస్ అంటే మార్చురీలు. చాలామందిని కలిపి చుల్పాస్’లో ఖననం చేశారు. ఎముకలపై ఎరుపు రంగును ఎలా ? ఎందుకు ? పూసినట్లు పరిశోధనల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఈ పరిశోధన నివేదిక 2023లో “జర్నల్ ఆఫ్ ఆంత్రోపోలాజికల్ ఆర్కియాలజీ” యొక్క మార్చి సంచికలో ప్రచురితమైంది. ఇందుకోసం వివిధ రకాల రెడ్ కలర్ వాడారని.. చనిపోయిన తర్వాతే రెడ్ కలర్ వేసినట్టు పరిశోధనలో తేలింది.

ఇలా విశ్లేషణ చేశారు..

పెరూలో వేల సంవత్సరాల క్రితం అంత్యక్రియల ఆచారాలలో భాగంగా ఎరుపు రంగును ఉపయోగించారని గుర్తించారు. మరణం అంతం కాదు, అది వేరే ఉనికిగా మారే క్షణం. ఒక రూపం నుంచి మరొక రూపానికి మారడం, మున్ముందు కొత్త జీవితంలోకి ప్రవేశించడం వంటివి.
పరిశోధకులు 38 వేర్వేరు కళాఖండాలు, ఎముకల నుంచి ఎరుపు రంగు నమూనాలను తీసుకున్నారు. వాటిలో 25 మానవ పుర్రెలు ఉన్నాయి.  ఎక్స్-రే పౌడర్ డిఫ్రాక్షన్, ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమెట్రీ, లేజర్ అబ్లేషన్ ICP-MS అనే మూడు పద్ధతులతో ఆ పురాతన పుర్రెలు, ఎముకల పై ఉన్న రంగులను విశ్లేషించారు. 24 పుర్రెల శాంపిళ్లపై ఎరుపు రంగుతో పాటు హెమటైట్ వంటి ఇనుము యొక్క ట్రేస్ కూడా ఉన్నట్టు వెల్లడైంది. 13 నమూనాలలోని రంగు సిన్నబార్ నుండి వచ్చింది.ఇందులో పాదరసం కూడా కలపబడింది.

ఎక్కువ భాగం వయోజన పురుషులవే..

ఎముకలు పెయింట్ చేయబడిన పుర్రెల్లో ఎక్కువ భాగం వయోజన పురుషులవే. అయితే మహిళలు, చిన్నారులతో పాటు పలువురి ఎముకలకు కూడా రంగులు వేశారు. పుర్రెలను నిశితంగా పరిశీలించినప్పుడు, ఎరుపు రంగు ఎలా అద్దారో కూడా నిర్ధారించబడింది. బోస్టన్ విశ్వవిద్యాలయంలోని మానవ శాస్త్ర పురావస్తు శాస్త్రవేత్త మరియు పరిశోధన యొక్క ప్రధాన రచయిత అయిన జాకబ్ బోంగర్స్ అధ్యయనంలో ఈవిషయాలు వెలుగు చూశాయి. పుర్రెలపై మందపాటి పొడవైన, క్షితిజ సమాంతర రేఖలు కనిపిస్తాయి. ఇవి చిత్రకారుడి వేళ్లతో చిత్రించబడ్డాయని తేలింది. చనిపోయిన వారి శరీరం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ రంగును పూశారని అధ్యయనంలో స్పష్టమైంది.