Site icon HashtagU Telugu

Funny Comments:: రిషబ్ శెట్టిలో మెడలో గొలుసు…రజనీకాంత్ ఇంట్లో దోమల బ్యాట్…నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..!!

Kanthara (1)

Kanthara (1)

రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిట్ టాక్ తోపాటు భారీ వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది ఈ మూవీ. కాంతార మూవీ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి, సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే సోషల్ మీడియాలో రజనీకాంత్, రిషబ్ శెట్టి ఫొటో గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కేవలం వారిద్దర్నీ కాదు…వారి పరిసరాల్లో ఉన్న వస్తువులపై నెటిజన్ల కన్ను పడింది. ముఖ్యంగా రిషబ్ మెడలో ఉన్న బంగారు గొలుసు గురించి చాలా మంది వ్యాఖ్యానించారు. ఈగొలుసును రిషబ్ కు రజనీకాంత్ బహుమతిగా ఇచ్చారంటున్నారు. రిషబ్ శెట్టి మెడలోని బంగారు గొలుసును ఎవరైనా గమనించారా ? ఇది రజనీకాంత్ సార్ ఇచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదొక్కటే కాదు ఇంకొన్ని వస్తువులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. వాటిలో మొబైల్ ఫొన్, గౌతమ బుద్ధుని విగ్రహం, టేబుల్ పై దోమల బ్యాట్ కూడా ఉండటాన్ని అభిమానులు గమనించారు. ఇది సాధారణ విషయమే అయినా…అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

రజనీ సర్ కు కూడా దోమల బ్యాట్ అవసరమని …బహుశ రజనీ సార్ ఇంట్లోకి దోమలు వచ్చేందుకు సాహసించవని నేను అనుకుంటున్నాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మధ్య తరగతి కుటుంబాల్లో దోమల బ్యాట్ వాడటం కాదు..రజనీకాంత్ సార్ కూడా దోమల బ్యాట్ ను ఉపయోగిస్తున్నారంటూ ఛమత్కరించారు.

Exit mobile version