Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

కుక్క లేదా శునకం విశ్వాసానికి మారుపేరు. మానవులు చాలా మంది ఎక్కువగా ప్రేమించే జంతువు ఏదైనా ఉంది అంటే

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 06:30 AM IST

కుక్క లేదా శునకం విశ్వాసానికి మారుపేరు. మానవులు చాలా మంది ఎక్కువగా ప్రేమించే జంతువు ఏదైనా ఉంది అంటే అది కేవలం కుక్క మాత్రమే చెప్పవచ్చు. ఎందుకు అంటే కుక్క కి ఒక్కపూట భోజనం పెడితే అది విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎప్పటికీ ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కుక్కలు ఒక్క పిడికెడు అన్నం పెడితే చాలు మనపై విశ్వాసాన్ని చూపించడం మాత్రమే కాకుండా తన యజమానికి ఏదైనా హాని కలిగింది అంటే చాలు వాటి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడుతూ ఉంటాయి.

అయితే పల్లెటూర్లలో మనకు వీధి కుక్కలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. కానీ సిటీలలో మాత్రం నూటికి ఎనభై శాతం వరకు మనుషులు ఇంట్లో పెంపుడు కుక్కని పెంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వాటి కోసం లక్షలకు లక్షలు ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. వాటి కోసం సపరేట్ గా ఫుడ్, హాస్పిటల్స్, రూమ్స్ అంతేకాకుండా వాటికి బట్టలు కూడా వేసి హేర్ కటింగ్ లాంటివి కూడా చేపిస్తూ ఉంటారు. అయితే చాలామంది వారి పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు ఏదైనా అయింది అంటే తల్లడిల్లీ పోతుంటారు. అయితే ఇప్పటివరకు పోలీసు శాఖ వారు లేదంటే ఆర్మీలో ఉన్నవారు చనిపోయిన శునకానికి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం చూసాం.

 

ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా అలాంటిదే అని చెప్పవచ్చు. కానీ ఆ కుక్క మాత్రం పోలీసు,ఆర్మీ డిపార్ట్మెంట్ కు చెందినది కాదు. ఒక వ్యక్తి 17 ఏళ్లుగా కుటుంబంలో ఒక కుక్కని పెంచుకుంటూ ఉన్నాడు. దాంతో ఆ కుక్కను వారి ఇంట్లో మనిషిగా భావించేవారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కుక్క మరణించడం జరిగింది. దీంతో ఆ యజమాని కుక్కపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ సాంప్రదాయ ప్రకారం మనుషులకు ఏ విధంగా అయితే అంత్యక్రియలు నిర్వహిస్తారో అదే విధంగా ఆ కుక్కకు కూడా ఘనంగా అంతక్రియలు నిర్వహించాడు. అంతేకాకుండా బ్యాండ్ మేళాలు, టపాసులు కాలుస్తూ అంతిమయాత్ర కొనసాగించారు. ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా వర్షం పడుతున్న కూడా ఆ కుక్క అంతిమయాత్రను కొనసాగించారు.