Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 04:49 AM IST

జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ముఖ్తియార్ భట్ అనే ఉగ్రవాది గతంలో సీఆర్పీఎఫ్, ఏఎస్ఐ, ఇద్దరు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని చంపడంతో పాటు అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదిని కాల్చిచంపడం ఇదొక పెద్ద విజయమని పోలీసులు తెలిపారు.

భద్రతా బలగాల శిబిరంపై దాడి చేసేందుకు ముఖ్తియార్ భట్ మరో విదేశీ ఉగ్రవాదిలో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు పక్కా సమాచారంతో అప్రమత్తమయ్యారు. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కాల్పులు జరిపాయి. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టడంతో..అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు మరణించారు. ఘటనాస్థలం నుంచి ఏకె 47 రైఫిల్, ఏకే 56 రైఫిల్ , పిస్టర్ స్వాధీనం చేసుకున్నాయి. అవంతిపొర పోలీసులు, ఆర్మీ కలిసి భారీ ఉగ్రవాద చర్య ఘటనను అడ్డుకున్నాయి. కాగా మంగళవారం తెల్లవారుజామున అనంతర్ నాగ్ జిల్లాలోని సేమ్ థాన్ బిజ్ బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ లో ఒక్కరోజులోనే రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.