Elon Musk Bodyguards : ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల యజమాని ఎలాన్ మస్క్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో అంతలా ఫేమస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన అమెరికా పాలిటిక్స్‌లోనూ బిజీగా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ భారీ విరాళాన్ని ఇచ్చారు. ట్రంప్ కూడా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్‌కు కీలక పదవిని ఇస్తానని ప్రకటించారు. తాజాగా ఎలాన్ మస్క్ సెక్యూరిటీపై అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాలివీ..
Also Read :Gold Mine Dispute: బంగారు గని స్థలం కోసం ఘర్షణ.. 30 మంది మృతి
- ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. ఆయన నికర సంపద విలువ రూ.20 లక్షల కోట్లు.
- గతంలో ఎలాన్ మస్క్(Elon Musk Bodyguards) సెక్యూరిటీ లేకుండానే తిరిగేవారు. ఆయన సంపద, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరిగింది.
- తొలుత మస్క్ సెక్యూరిటీ కోసం ఇద్దరు బాడీ గార్డులే ఉండేవారు. అయితే క్రమంగా వాళ్ల సంఖ్యను 20కి పెంచారు.
- మస్క్ తన సెక్యూరిటీ కోసం ఏటా భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు.
- ఇటీవల జూన్‌లో టెస్లా కంపెనీ వాటాదారుల సమావేశంలో మస్క్ కీలక వివరాలను తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తనను హత్య చేస్తామని బెదిరించారని చెప్పారు.
- 2022 సంవత్సరంలో ఓసారి ఎలాన్ మస్క్ ఇంటి అడ్రస్ వివరాలు లీకయ్యాయి. దీంతో ఆయన రహస్యంగా ఆ ఇంటిని ఖాళీ చేశారు.
- మస్క్ వద్ద ప్రైవేటు విమానాలు ఉన్నాయి. అయితే వాటి సమాచారాన్ని ట్రాక్ చేస్తోందనే అనుమానంతో ఒక ఎక్స్ అకౌంటును ఆయన బ్యాన్ చేయించారని సమాచారం.
- మస్క్ సెక్యూరిటీ కోసం పెట్టే ఖర్చుల వివరాలను తాజాగా టెస్లా సంస్థ వెల్లడించింది.
- ఎలాన్ మస్క్ సెక్యూరిటీ టీమ్‌ను ‘వాయేజర్’ అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తుంటారు.
- 2023 ఆర్థిక సంవత్సరంలో ఎలాన్ మస్క్ తన సెక్యూరిటీ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు.
- గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎలాన్ మస్క్ తన సెక్యూరిటీ కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టారు.
- ఎలాన్ మస్క్ వెళ్లే ప్రదేశాలను ఈ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఏదైనా దాడి జరిగితే వాటి నుంచి మస్క్‌ను రక్షించి సురక్షిత ప్రదేశానికి తరలిస్తారు.
- ఎలాన్ మస్క్ సెక్యూరిటీ టీమ్ అమెరికా సీక్రెట్ సర్వీస్‌లా కచ్చితత్వంతో పనిచేస్తుంది అని చెబుతుంటారు.
- ఎలాన్ మస్క్ బాత్ రూంకు వెళ్లేటప్పుడు కూడా ఆయన వెంట సెక్యూరిటీ గార్డులు వెళ్తారట.