Elon Musk – 11 Children: 11వ బిడ్డకు తండ్రైన మస్క్‌.. మూడో భార్యకు సీక్రెట్‌గా మూడో బిడ్డ

కుటుంబ నియంత్రణ గురించి ప్రపంచవ్యాప్తంగా నీతులు చెప్పే అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Elon Musk 11 Children

Elon Musk – 11 Children: కుటుంబ నియంత్రణ గురించి ప్రపంచవ్యాప్తంగా నీతులు చెప్పే అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఎంతోమంది ప్రజలు కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తున్నారు. ఈ జాబితాలోకే ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కూడా వస్తారు. ఆయన సీక్రెట్‌గా 11వ బిడ్డకు తండ్రి అయ్యారు. ఎలాన్ మస్క్ మూడో భార్య షివాన్‌ జెలీస్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే  సీక్రెట్‌గా మూడో బిడ్డకు జన్మను ఇచ్చిందట. ఈమేరకు వివరాలతో బ్లూమ్‌ బెర్గ్‌ మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది. షివాన్‌ జెలీస్‌ 2021 సంవత్సరంలో కవలలకు జన్మను ఇచ్చింది. ఈ ఏడాది మరో బిడ్డకు ఆమె తల్లి అయింది.

We’re now on WhatsApp. Click to Join

షివాన్‌ జెలీస్‌ భారత సంతతి మహిళ అని చాలామందికి తెలియదు. షివాన్‌ జెలీస్‌ తల్లి పేరు శారద. శారద కెనడాలో జాబ్ చేస్తుండగా రిచర్డ్ జెలీస్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆయన్నే పెళ్లాడుతుంది. శారద, రిచర్డ్ జెలీస్‌ దంపతులకు 1986 ఫిబ్రవరి 8న జన్మించిన కూతురే ఈ షివాన్‌ జెలీస్‌. ఈమె ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌‌గా వ్యవహరించేవారు. ఈక్రమంలోనే ఎలాన్ మస్క్‌కు దగ్గరై పెళ్లి చేసుకున్నారు. ఇక ఎలాన్ మస్క్ మొదటి భార్య జస్టిన్‌ మస్క్‌కు ఐదుగురు సంతానం ఉన్నారు. రెండో భార్య  మ్యూజిషియన్‌ గ్రిమెస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  మూడో భార్య  షివాన్‌ జెలీస్‌‌కు కూడా ముగ్గురు పిల్లలు(Elon Musk – 11 Children) ఉన్నారు.

Also Read :Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్

2021లో జెలీస్‌కు కవలలు జన్మించిన సమయంలో మస్క్‌ మాట్లాడుతూ ‘‘ఎక్కువ మంది సంతానం లేకపోతే మానవత నాగరికత  అంతం అవుతుంది. నా మాటలు రాసిపెట్టుకోండి’’ అని కామెంట్ చేశాడు. ఎలాన్ మస్క్‌ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఇదే కొత్తేం కాదు. తనతో పిల్లలను కనాలని మస్క్‌ చాలాసార్లు కోరాడని 2013లో స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ ఇటీవల వెల్లడించింది. అప్పట్లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌‌లో దీనిపై కథనం కూడా పబ్లిష్ అయింది. మరో ఇద్దరు స్పేస్ ఎక్స్  ఉద్యోగినులతో కూడా మస్క్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read :Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్

  Last Updated: 23 Jun 2024, 01:53 PM IST