Elephants: గడల కోసం లారీని అడ్డుకున్న ఏనుగులు.. వీడియో వైరల్?

ఏనుగులు.. వీటిని చూడగానే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల మారిపోయి వాటిని చూడటానికి

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 07:15 AM IST

ఏనుగులు.. వీటిని చూడగానే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల మారిపోయి వాటిని చూడటానికి ఎగబడుతూ ఉంటారు. అయితే ఆ ఏనుగులు మనిషి తనకు హాని చేయనంతవరకు సైలెంట్ గా ఉంటాయి. కానీ మనుషుల వల్ల కానీ లేదంటే ఇతర జీవులు వల్ల కానీ దానికి హాని కలుగుతుంది అని తెలిస్తే మాత్రం వాటిని అంత ఈజీగా వదిలిపెట్టవు. ఇతర జీవుల సంగతి పక్కన పెడితే మనిషి కనుక ఏనుగు చేతికి చిక్కితే ఇంకా అంతే సంగతులు. కాగా అప్పుడప్పుడు ఏనుగులు అడవుల్లో ఉండే రహదారుల పైకి వచ్చి బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు ఊర్లో ఉండే చెరుకు తోటల్లోకి కూడా చొరబడి పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా కూడా ఒక అడవి దారి గుండా చెరుకు లారీ వెళ్తూ ఉండగా వెంటనే ఒక పెద్ద ఏనుగు మరొక చిన్న ఏనుగు వచ్చి ఆ లారీని అడ్డుకున్నాయి. అలారిని చాలా సేపటి వరకు కదలకుండా అలాగే నిలబడ్డాయి. ఆ లారి డ్రైవర్ వచ్చి వాటిని పక్కకు తప్పించాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి కదలడం లేదు. దాంతో ఆ డ్రైవర్ చేసేదేమీ లేక లారీ ఎక్కి అందులో ఉన్న కొన్ని చెరుకు గడ్డలనే పక్కకి వేశాడు. అప్పుడు ఆ ఏనుగులు ఆ చెరుకు గడలను తినడం కోసం వెళ్లగానే ఆ లారీ డ్రైవర్ ఎక్కడి నుంచి వెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఆ వీడియోని బట్టి చూస్తే ఆ ఏనుగులు చెరుకుగడల కోసం లారీని ఆపేసాయి అన్నది తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా ఎదురుగా వస్తున్న మరొక వాహనంలో వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐఎఫ్ ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇలా వసూలు చేసే పన్ను ను ఏమంటారు? అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత ట్వీట్ చేస్తూ.. ఈ వీడియో చూడడానికి సరదాగా అనిపించినప్పటికీ అలాంటి వన్యప్రాణులకు ఆహారం పెట్టడం అసలు మంచిది కాదు. ఎందుకంటే అలా ఆహారం పెట్టడం అలవాటు చేస్తే రోడ్లపైకి వచ్చి మనుషులు ఉండే చోట్ల కూడా అవి చొరబడుతూ ఉంటాయి అందువల్ల అలాంటి వాటికి ఆహారం పెట్టకూడదు అని ఐఎఫ్ఎస్ అధికారి సూచించారు. కథ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే లక్షల్లో లైక్స్ వేలలో కామెంట్స్ వచ్చాయి.