Elephant Viral Video: ఏనుగుకు దురదేస్తే.. దుమ్ము లేచింది.. కారు తుక్కుతుక్కు!!

ఏనుగుకు కోపం వస్తే ఏమైనా ఉంటుందా ? దుమ్ము లేపుతుంది. ఇరగదీస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Elephant Imresizer (1)

Elephant Imresizer (1)

ఏనుగుకు కోపం వస్తే ఏమైనా ఉంటుందా ? దుమ్ము లేపుతుంది. ఇరగదీస్తుంది.

ఇటువంటిదే ఒక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

ఒక ఏనుగు అడవికి దగ్గరగా ఉన్న రోడ్డు మీదకు వచ్చింది. అప్పుడు దానికి దగ్గరికి ఒక వ్యక్తి తన కారును తీసుకొచ్చాడు. ఏనుగును దగ్గర నుంచి చూడాలనుకున్నాడు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. అప్పుడు ఏనుగుకు చాలా కోపం వచ్చింది. వెంటనే కారు మీద తన ప్రతాపం చూపించింది. తన కాలితో కారు టైరు ను నొక్కిపడేసింది. కారును వెనక్కు తోసేసింది. అయినా దాని కోపం చల్లారలేదు. దీంతో ఏకంగా కారు మీదికి ఎక్కి.. దాన్ని అద్దాలు,
ముందు భాగాన్ని పగిలిపోయేలా బలంగా తన్నింది. ఇదంతా చూసి భయపడిపోయిన డ్రైవర్.. కారును వెనక్కు పోనిచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ఇలా జంతువులను దగ్గరి నుంచి చూసే క్రమంలో అలర్ట్ గా ఉండటం అత్యవసరం. హారన్ లు కొడుతూ.. వాటిని చిరాకు తెప్పించడం మంచిది కాదు. చిరాకు తెప్పిస్తే జంతువులు బెదిరిపోయి.. వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇలా అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ఈ వీడియో చూసి షాక్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గజరాజుకి కోపం వస్తే ఏం చేస్తుందో చూశామని కొందరు కామెంట్లు చేశారు. ఆ కారులోని వ్యక్తి భయంతో వణికిపోయి ఉంటాడని కొందరు పేర్కొన్నారు.

ఏనుగు పిల్లకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ..

కోయంబత్తూర్‌ సత్యమంగళం ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై వెళ్తోంది. అయితే ఆ ఏనుగుల మధ్యలో ఓ పిల్ల ఏనుగు దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. గుంపులో నుంచి పిల్ల ఏనుగు బయటకు వచ్చినప్పుడల్లా..పెద్ద ఏనుగులు దాన్ని కవర్ చేసుకుంటూ నడుస్తున్నాయి. ఈ ఇంట్రస్టింగ్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.  ఈ ప్రపంచంలో ఎవ‌రూ కూడా అంత భద్రత క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకే సాధ్యమైంది. అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జెడ్ ప్లస్, ప్లస్, ప్లస్ కేటగిరి భ‌ద్రత క‌ల్పించాయంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/buitengebieden/status/1567047392251240449

  Last Updated: 09 Sep 2022, 01:26 AM IST