Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగుస్తున్న ఉచ్చు..సన్నిహితుల ఇండ్లపై ఈడీ రెయిడ్స్..!!

Kavitha

Kavitha

ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీతోపాటు గుర్ గావ్, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే 30చోట్ల ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్లై నివాసంతోపాటు ఆఫీసు, రాబిన్ డిస్టిల్లరీలోనూ దాడులు జరుగుతున్నాయి. అతనితో సంబంధం ఉన్న అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాల్లోనూ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ కుంభకోణంలో టీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అభిషేక్ రావు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు తెలపడం గమనార్హం. కవితకు అభిషేక్ రావు సన్నిహితుడిగా ఉండటంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉందని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీలాండరిగ్ జరిగినట్లు కూడా అనుమానాలు తలెత్తడంతోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఏక కాలంలో 6 నగరాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Exit mobile version