Candy: అక్కడ చాక్లెట్ తినడమే పని.. సంవత్సరానికి రూ.61.2 లక్షల జీతం.. ఎక్కడంటే?

చాక్లెట్.. తీయతీయగా ఉండే ఈ పదార్థాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా

  • Written By:
  • Updated On - August 6, 2022 / 01:48 PM IST

చాక్లెట్.. తీయతీయగా ఉండే ఈ పదార్థాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక ఆ చాక్లెట్ ని నోట్లో వేసుకొని గుటుక్కని మింగేస్తూ ఉంటారు. ఇక టీవీలో యాడ్ లు చూసినప్పుడు కూడా వాటి వైపు చూస్తే నోరు ఊరక మానదు. అయితే చాక్లెట్లను ఎక్కువగా తినవద్దు అని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చాక్లెట్లు తిని పెట్టడమే ఒక ఉద్యోగం అని అంటున్నారు. అంతేకాదండోయ్ ఆ చాక్లెట్లు తింటే లక్షల డబ్బులు జీతం గా ఇస్తారట. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల కెనడాకు చెందిన క్యాండీ ఫన్ హౌస్ అనే సంస్థ చీఫ్ క్యాండీ ఆఫీసర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలి అని ఆన్లైన్లో ఒక ప్రకటన ఇచ్చింది. అయితే ఆ కంపెనీ వారు తయారు చేసే వివిధ రకాల చాక్లెట్లు క్యాండీలను టెస్ట్ చేసి అవి అందరికీ నచ్చుతాయో లేదో గుర్తించాలని, అంతేకాకుండా ఏ ఏ ఫేవర్ లు కలిపితే నచ్చుతాయి అన్నది కూడా తేల్చి చెప్పాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా చాక్లెట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనకి చేయాల్సి ఉంటుందని, ఆ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి ఏడాదికి లక్ష కెనడా డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 61.2 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ పెట్టింది.

ఈ ఉద్యోగానికి ఆగస్టు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించింది. ఈ దరఖాస్తును చూసిన ప్రతి ఒక్కరూ ఆశపడి మరి ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. అంతేకాకుండా ఐదేళ్ల వయసు దాటిన పిల్లలు కూడా తల్లిదండ్రులు అనుమతితో చీప్ క్యాండీ ఆఫీసర్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అని కంపెనీ పేర్కొనడంతో భారీ మొత్తంలో ఈ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. అయితే కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలతో దీనికి అప్లై చేయించడం అప్లికేషన్ నింపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.