Site icon HashtagU Telugu

Earth Rotation:భూమి రౌండప్.. యమ స్పీడప్.. జులై 29 ఘటన లోగుట్టు ఇదీ!!

Earth

Earth

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు.

ఒకసారి భూ పరిభ్రమనానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు.

భూపరిభ్రమణం వల్లే పగలు, రాత్రులు ఏర్పడతాయి. పవనాల మార్గాలలోను, సముద్ర ప్రవాహాల మార్గాల్లోను మార్పులు వస్తాయి.

ఇక్కడి దాకా అంతా సోషల్ సైన్స్.. అందులోని ఫ్యాక్ట్స్!! తాజాగా ఏం జరిగిందంటే.. జూలై 29న(శుక్రవారం) 24 గంటల కంటే
1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయ్యింది. దీంతో చాలా చిన్న రోజుగా రికార్డుకెక్కింది.
సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ 24 గంటల వ్యవధిలో తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది జులై 29న 24 గంటలకు ముందుగానే భూపరిభ్రమనం పూర్తి చేసుకొని..అతి తక్కువ నిడివి కలిగిన రోజును నమోదు చేసింది.

ఇంతకుముందు 1960, 2020, 2021 సంవత్సరాల్లో మాత్రమే ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని పూర్తి చేసింది. 2021లో జులై 19న కూడా భూ భ్రమణం వేగం పెరిగింది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరగడం వల్ల ఏదైనా జరుగుతుందా ? అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. భూ భ్రమణ వేగం పెరగడం వల్ల నెగిటివ్‌ లీప్‌ సెకండ్లకు దారి తీస్తుందని పరిశోధనకులు అంటున్నారు. ఇది గ్లోబల్‌ సమయంపై ప్రభావం చూపడంతోపాటు కంప్యూటర్‌ ప్రోగ్రాంలను క్రాష్‌ చేసి డేటా స్టోరేజ్‌ను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీప్ సెకండ్ పరిస్థితి కాలమాన క్రమానికి ముప్పు అవుతుంది. గడియారాలు 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల నుంచి 23 గంటల 59 నిమిషాల 60 సెకండ్లు రాకముందే 00:00:00కు జారుకుంటాయి. దీని ప్రభావంతో డాటా స్టోరేజ్‌లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుని పలు సాంకేతిక అవాంతరాలకు దారితీస్తాయని చెబుతున్నారు.

మరోవైపు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఇంతలా పెరగడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియదు. అయితే భూమి లోపలి లేదా బయటి పొరల్లో మార్పు, మహాసముద్రాలు, ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణం కావచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అలాగే భౌగోళిక ధ్రువాల కదలికల వల్ల భూ భ్రమణం వేగం పెరుగుతోందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఈవిధంగా అతి వేగంతో భూమి తిరగడాన్ని ‘చాండ్లర్ వొబుల్’ అని పిలుస్తారు.

Exit mobile version