Dogs: కుక్కకు నక్కకు ఒక్క పోలిక .. కారణాల గుట్టురట్టు!!

మనిషికి అత్యంత విశ్వసనీ యమైన జంతువు..కుక్క! అది నక్క జాతికి చెందింది అనే చర్చ మొదటి నుంచే నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - July 8, 2022 / 08:30 AM IST

మనిషికి అత్యంత విశ్వసనీ యమైన జంతువు..కుక్క! అది నక్క జాతికి చెందింది అనే చర్చ మొదటి నుంచే నడుస్తోంది. అయితే దానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు మాత్రం వెలుగు చూడలేదు. తాజాగా లండన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు ఆ విషయాలను వెలుగులోకి తెచ్చారు. కుక్కలకు నక్క జాతికి ఉన్న సంబంధం ఏమిటి ? ఈ రెండింటికి ఉన్న జన్యు సారూప్యత ఏమిటి ? అనేది పూర్తి ఆధారాలతో గుర్తించారు. రెండు ప్రాచీన నక్క జాతుల్లో ఉన్న ఒక జన్యువు.. యురేషియా ప్రాంతంలోని ( ఐరోపా, పలు ఆసియా దేశాలు) కుక్కల్లోనూ ఉందని వెల్లడైంది. 15వేల ఏళ్ల క్రితం మంచు యుగం సమయంలో కుక్కలను మచ్చిక చేసే ప్రక్రియ మొదలైందని తేల్చారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్నల్ నేచర్”లో ప్రచురితం అయింది.

అధ్యయనం ఇలా జరిగింది..

ప్రాచీన నక్క జాతులకు సంబంధించి లభించిన అవశేషాలను 16 దేశాలలోని 38 పరిశోధన సంస్థలు భద్రపరిచాయి. అక్కడి నుంచి లండన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు 72 శాంపిల్లను సేకరించి విశ్లేషణ చేశారు. ఇందులో 32వేల ఏళ్ల క్రితం జీవించిన సైబీరియా నక్క తలకు సంబంధించిన శాంపిళ్ళు కూడా ఉన్నాయి. వీటన్నింటిని జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఈ వివరాలతో ప్రాచీన నక్కల డీఎన్ఏ సీక్వెన్స్ డేటాను రూపొందించారు. దీన్ని విశ్లేషించగా..ప్రస్తుతం మన మధ్య జీవిస్తున్న కుక్కల డీఎన్ఏకు, ప్రాచీన కాలంలో ఆసియా ప్రాంతంలో జీవించిన నక్కల డీఎన్ఏకు దగ్గరి సంబంధం ఉందని చెప్పారు. అయితే ఐరోపా దేశాల్లోని కుక్కల డీఎన్ఏ కు.. ప్రాచీన నక్కల డీఎన్ఏ కు అంత సామీప్యత లేదని తెలిపారు. ప్రధానంగా గత 10వేల ఏళ్లుగా నక్కల్లోని ఒక జన్యువు.. కుక్కల్లోనూ ఉందని స్పష్టం చేశారు.
ఈ పరిశోధన ద్వారా 30వేల తరాలు వెనక్కి వెళ్లి నక్కల్లో జరిగిన జన్యు మార్పుల గురించి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు చేశారు.