Dog shoes: కుక్కకు బూట్లు.. వావ్ అంటున్న నెటిజన్స్!

పెట్స్ మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పెట్స్ తో రిఫ్రెష్ అవుతున్నారు ఈ తరం.

Published By: HashtagU Telugu Desk
Dog

Dog

పెట్స్ మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పెట్స్ తో రిఫ్రెష్ అవుతున్నారు ఈ తరం. అందుకే మనుషులు తమకు ఎలాంటి సకల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారో.. పెట్స్ కూ వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఓ జంతు ప్రేమికుడు కుక్క కు బూట్లు వేయడం అందర్నీ ఆకట్టుకుంది.

కాళ్లకు బూట్లు వేసుకొని మురిసిపోతున్న శునకం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో కనిపించింది. కుక్కకు షూ ఏంటబ్బా..! అని అటు వెళ్తున్న వారూ ఆసక్తిగా గమనించారు. శునకం కాలివేళ్ల మధ్య మట్టి ఇరుక్కోకుండా దాన్ని యజమాని చేసిన ప్రయత్నం ఇది. వాటికి రక్షణగా ఉంటుందని ఇలా చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  Last Updated: 30 Sep 2022, 03:53 PM IST