Spoons In Stomach: యువకుడి కడుపులో 62 స్టీల్ స్పూన్ లు.. చివరికీ ఏం జరిగిందంటే?

సాధారణంగా మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళను విసిగించినప్పుడు కోపంలో మనిషివేనా

Published By: HashtagU Telugu Desk
63 Spoons In The Stomach

63 Spoons In The Stomach

సాధారణంగా మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళను విసిగించినప్పుడు కోపంలో మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ తిడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఆ మాట నిజం చేసేసాడు. కానీ ఆ వ్యక్తి తిన్నది గడ్డి కాదండోయ్ ఏకంగా స్టీల్ స్పూన్ లే తినేశాడు. స్టీల్ స్పూన్లు తినడం ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా! మీరు విన్నది నిజమే ఒక వ్యక్తి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 63 స్టీల్ స్పూన్లను తిన్నాడట. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ భయంకరమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ముజఫర్ నగర్ జిల్లా కు చెందిన విజయ్ అనే ఒక వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఏడాది కిందట డి అడిక్షన్ అనే కేంద్రంలో చేర్పించారు. కదా అతడు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక హాస్పిటల్ లో అతని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఎందుకంటే అతడి కడుపులో డాక్టర్లు ఏకంగా 63 స్టీల్ స్పూన్ లను గుర్తించారు.

ఇక సదరు డాక్టర్లు అతన్ని ఆ స్పూన్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించగా గత ఏడాది నుంచి తను ఆ టీ స్పూన్ లను తింటున్నట్లు విజయ్ చెప్పడంతో ఒక్కసారిగా డాక్టర్లు షాక్ అయ్యారు. అయితే ఆ టీస్పూన్ నువ్వే తింటున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చాడట విజయ్. అనంతరం డాక్టర్లు దాదాపుగా రెండు గంటలసేపు శ్రమించి ఆపరేషన్ చేసి ఆ స్టీల్ స్పూన్ లను తొలగించారట. ప్రస్తుతం విజయ్ ఐసీయూ లో ఉండగా అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ ఈ విషయంపై అతని కుటుంబ సభ్యులు స్పందిస్తూ డి అడిక్షన్ కేంద్రంలో వారు విజయ్ కి బలవంతంగా స్పూన్లు తినిపించారు అంటూ ఆరోపిస్తున్నారు.

  Last Updated: 30 Sep 2022, 12:25 AM IST