Site icon HashtagU Telugu

Plastic Toys : పిల్లలు ప్లాస్టిక్ బొమ్మలను నోట్లో పెట్టుకుంటున్నారా…అయితే చాలా ప్రమాదం…ఎందుకో తెలుసుకోండి..!!

Plastic Toys

Plastic Toys

ప్లాస్టిక్ వాడకం ప్రకృతికే కాదు మీ ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. ముఖ్యంగా దీని ఉపయోగం చిన్న పిల్లలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్లాస్టిక్ బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం అని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా ప్లాస్టిక్ బొమ్మలు రకరకాల విష రసాయనాలతో తయారవుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇది మాత్రమే కాదు, ఈ రసాయనాల స్థాయిలు చాలా ప్రమాదకరమైన మొత్తంలో ఉంటాయి. భవిష్యత్తులో క్యాన్సర్, సంతానలేమి వంటి సమస్యలు కూడా రావచ్చని.. స్వీడన్‌లోని పరిశోధకుల బృందం తేల్చింది.

గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది నిపుణులు దాదాపు 157 రకాల బొమ్మలను పరీక్షించారు. వాటిలో ప్లాస్టిక్ బాల్స్, బొమ్మలు మొదలైనవి ఉన్నాయి. ప్లాస్టిక్‌ను మరింత మన్నికగా చేయడానికి ఉపయోగించే రసాయనాలైన ప్లాస్టిసైజర్లు విషం కంటే తక్కువేమీ కాదని తేల్చారు.

వీటివల్ల ఉబ్బసం, రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, తక్కువ IQ, పెరుగుదల మందగించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ విష రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, అవి క్యాన్సర్‌కు కారణమయ్యే DNA కి అంతరాయం కలిగిస్తాయని తేల్చారు.

యూరోపియన్ యూనియన్ మరియు UK ఏర్పాటు చేసిన చట్టాల ప్రకారం, తయారీదారులు బొమ్మ మొత్తం బరువులో 0.1 శాతానికి మించకుండా థాలేట్స్ వంటి రసాయనాలను ఉపయోగించాలి. అదే సమయంలో, క్లోరినేటెడ్ పారాఫిన్ పరిమితి 0.15 శాతం మాత్రమే వాడాలి.

కానీ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, అధ్యయనంలో 30 శాతం కొత్త బొమ్మలు చట్టపరమైన పరిమితికి మించి రసాయన స్థాయిలను కలిగి ఉన్నాయి. ఈ పదార్ధాల స్థాయి సూచించిన దానికంటే 84 శాతం ఎక్కువగా ఉందని తేలింది.

నేటి యుగంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించడం దాదాపు అసాధ్యం. కానీ ప్లాస్టిక్ బొమ్మలను పిల్లలు నోటిలో పెట్టుకునే అవకాశం ఉంది. కావునా వారికి ప్లాస్టిక్ కాకుండా, వెదురు, మెత్తటి కొయ్యతో చేసిన బొమ్మలు అందిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version