Shocking : సంతానోత్పత్తి రేటులో తెలుగురాష్ట్రాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

గతంలో పిల్లల కనే విషయంలో ముగ్గురు...ఇద్దరు...ఒక్కరు...ఇప్పుడు అసలే వద్దు అనే స్థాయికి చేరుకుంది. నేటితరం మహిళ సంతానోత్పత్తిపై ఎంతో ప్రభావం పడుతోంది.

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 11:56 AM IST

గతంలో పిల్లల కనే విషయంలో ముగ్గురు…ఇద్దరు…ఒక్కరు…ఇప్పుడు అసలే వద్దు అనే స్థాయికి చేరుకుంది. నేటితరం మహిళ సంతానోత్పత్తిపై ఎంతో ప్రభావం పడుతోంది. గత పదేళ్లలో దేశంలో సంతానోత్పత్తి రేటు 20శాతం తగ్గినట్లుగా SAMPLE REGISTRATION SYSTEM (SRS)-BULLETIN 2020 తెలిపింది. ప్రతి వెయ్యి మంది మహిళలకు సంవత్సరంలో పుట్టిన చిన్నారుల సంఖ్యను GFRగా నిర్ణయిస్తారు. 15-49 ఏళ్ళ వయస్సులోని వారిని ఈ గణాంకాల పరిధిలోకి తీసుకుంటారు. అయితే జమ్ముకశ్మీర్ లో GFR29శాతానికి తగ్గిపోయింది.

ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే…పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పట్టణాల్లో సంతానోత్పత్తి క్షీణత అనేది 15.6 ఉంటే…గ్రామీణ ప్రాంతాల్లో 20.2ఉంది. వివాహం చేసుకుంటున్న వారి వయస్సు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత పెరగడం, సంతాన నిరోధక సాధనాలు…ఇవన్నీ కూడా సంతానోత్పత్తి తగ్గడానికి కారణం అవుతున్నాయని ఎయిమ్స్ ఆబ్రెట్రిక్స్ మాజీ హెడ్ సునీతా మిట్టల్ అన్నారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును పరిశీలించినట్లయితే…ఆంధ్రప్రదేశ్ లో 50.7 శాతంగా ఉండగా….తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 28.5, ఉత్తరప్రదేశ్ 24, జార్ఖండ్ 24, రాజస్తాన్ 23.2 మహారాష్ట్రలో గత రెండు దశాబ్దాల్లో 18.6శాతానికి తగ్గింది. బీహార్ లో అత్యధికంగా TFR నమోదు అయ్యింది.