MS Dhoni : పూర్వీకుల ఊరిలో ధోనీ సింప్లిసిటీ .. వీడియో వైరల్

MS Dhoni : ‘ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలి’ అనే దానికి నిదర్శనంగా మహేంద్ర సింగ్ ధోనీ నిలుస్తున్నారు. 

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 05:48 PM IST

MS Dhoni : ‘ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలి’ అనే దానికి నిదర్శనంగా మహేంద్ర సింగ్ ధోనీ నిలుస్తున్నారు.  టీమిండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ సాధించి పెట్టిన  ధోనీ సింప్లిసీటీని ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు.  ధోనీని జార్ఖండ్ డైనమైట్ అని పిలుస్తారు. వాస్తవానికి ఆయన పూర్వీకుల స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఉన్న ల్వాలీ గ్రామం. 20 ఏళ్ల తర్వాత ల్వాలీ గ్రామానికి ధోనీ బుధవారం (నవంబరు 15న)  చేరుకున్నారు. ధోనీ, ఆయన భార్య సాక్షి, వారి స్నేహితులంతా కలిసి ల్వాలీకి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే ధోనీ దంపతులకు ఘన స్వాగతం లభించింది.  ధోనీ దంపతులు గ్రామంలోని నాలుగు దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో ధోనీని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. గ్రామంలోని యువకులు క్యూ కట్టి ధోనీతో సెల్ఫీ దిగారు. ధోనీ చివరిసారిగా 2003లో ఈ ఊరికి వచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రామస్తుల కథనం ప్రకారం.. ధోనీ తండ్రి పాన్ సింగ్ ధోనీ 45 ఏళ్ల క్రితం తన స్వగ్రామం ల్వాలీని  విడిచి వెళ్లిపోయి, జార్ఖండ్‌లోని రాంచీలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ధోనీ బంధువులు కొందరు ఈ గ్రామంలోనే ఉన్నారు. ధోనీ పూర్వీకుల ఇళ్లు ఇక్కడ ఇప్పటికీ ఉంది. ఉత్తరాఖండ్‌లోని ల్వాలి గ్రామంలో తనను పలకరించిన ఓ పెద్దావిడ పాదాలకు ధోనీ దంపతులు నమస్కరించారు. ల్వాలి గ్రామంలో ధోనీ సరదాగా గడిపిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ల్వాలీ గ్రామం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. అల్మోరా జిల్లా కేంద్రానికి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. ఇప్పటికీ ధోనీ బంధువులు చాలా మంది ఈ ఊర్లో(MS Dhoni) నివసిస్తున్నారు.