Looting Prasadas : గుడి నుంచి ప్రసాదాన్ని లూటీ చేసే ఆచారం.. ఎక్కడ ?

Looting Prasadas : ప్రసాదం.. అంటే భక్తితో సాధ్యమైనంత తక్కువగా పుచ్చుకునేది.

  • Written By:
  • Publish Date - November 19, 2023 / 01:31 PM IST

Looting Prasadas : ప్రసాదం.. అంటే భక్తితో సాధ్యమైనంత తక్కువగా పుచ్చుకునేది. దాన్ని అతిగా తీసుకోరు. ప్రసాదాన్ని దొంగిలించి తినడం గురించి కలలో ఊహించుకోవడం కూడా అపచారమే.. అలాంటిది  రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో ప్రతి సంవత్సరం అన్నకూట్ మహోత్సవం రోజున  భక్తులు  ప్రసాదాన్నిదొంగిలించి తింటారు. ఒక్కొక్కరు సంచుల నిండా.. కుండల నిండా ప్రసాదాన్ని నింపుకొని హడావుడిగా వెళ్లిపోతుంటారు. ఇక్కడి గిరిజనులు దాదాపు 350 ఏళ్లుగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా గత సోమవారం రోజున(నవంబరు 13న) శ్రీనాథ్‌జీ ఆలయంలో అన్నకూట్ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు ఎగబడి ప్రసాదాన్ని దొంగిలించి, కుండల్లో ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. గత సోమవారం రాత్రి 11 గంటలకు శ్రీనాథ్‌జీ స్వామివారికి 56 నైవేద్యాలు సమర్పించగా.. వాటన్నింటిని భక్తులు దొంగతనంతో కొద్దిసేపట్లోనే ఖాళీ చేశారు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్‌జీ స్వామివారికి ఇష్టమట.

Also Read: Number 1 : నంబర్‌ 1 మెరైన్‌ స్టేట్‌గా ఏపీ.. జలచరాలు, నదులు, సముద్రాల పరిస్థితి ఇలా..

స్థానికుల ఆచారం ప్రకారం..  నాలుగు వర్ణాల ప్రజల ఈ ప్రసాదాన్ని దొంగిలిస్తేనే ఈ అన్నకూట్ మహోత్సవం పూర్తవుతుంది. ఈ ప్రసాదాన్ని తినడం వల్ల రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు.  శ్రీనాథ్‌జీ స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. అది కుటుంబానికి నష్టాలను, కష్టాలను, దోషాలను నివారిస్తుందని విశ్వసిస్తారు. అన్నకూట్ దోపిడీ సంప్రదాయాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు(Looting Prasadas) ఆలయానికి తరలివచ్చారు.