Delhi : ఖలిస్తానీ ఉగ్రవాది ISI గుట్టురట్టు..నలుగురు షార్ప్ షూటర్ల అరెస్టు…!!

  • Written By:
  • Publish Date - October 29, 2022 / 04:53 AM IST

పాకిస్తాన్ గుఢాచార సంస్థ ఐఎస్ఐ సాయంతో నడుస్తున్న టెర్రరిస్టు గ్రూపు గుట్టురట్టయింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్, కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్ పాకిస్తాన్ మద్దతు గల ఖలిస్తానీతో అనుబంధానికి చెందిన నలుగురు షర్ప్ షూటర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురుని అరెస్టు చేశారు. వారి నుంచి 5చైనా హ్యాండ్ గ్రైనేడ్లు, ఏకే 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

డిసిపి స్పెషల్ సెల్ మినీషి చంద్ర తెలిపిన వివరాల ప్రకారం…సెప్టెంబర్ 24న ఢిల్లికి చెందిన సరాయ్ కాలే ఖాన్ నుంచి హార్డ్ కోర్ నేరస్ధుడైన లఖ్ బీర్ సింగ్ ను అరెస్టు చేశారు. అతన్ని విచారించిన తర్వాత అక్టోబర్ 13న గుర్జిత్ అలియాస్ గురిని ఢిల్లీలోని ఐఎస్ బిటీ కశ్మీర్ గేట్ సమీపంలో పట్టుకున్నారు. హర్మందర్ , సుఖ్ దేవ్ సుఖా ఇద్దరూ సరిహద్దు కార్యకలాపాల్లో ప్రధానభాగాన్ని పర్యవేక్షిస్తున్నారని గుర్జీత్ వెల్లడించిన అనంతరం హర్మేందర్ సింగ్, సుఖ్ దేవ్ లను పంజాబ్ లోని మోగాలోని వారి రహస్య ప్రదేశంలో పట్టుకున్నారు.

వారి నుంచి 4 పిస్టల్స్, 11 లైవ్ కాట్రిడ్జ్‌లు,ఒక పంప్ యాక్షన్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. గుర్జీత్ నుండి 1 పిస్టల్, 2 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హర్మీందర్ నుండి ఒక AK-47 అసాల్ట్ రైఫిల్, 2 పిస్టల్స్, 10 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సుఖ్‌దేవ్ నుండి ఒక MP-5 సబ్‌మెషిన్ గన్, 2 పిస్టల్, 10 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విచారణలో స్థాయిన మాడ్యూల్ కు పాకిస్తాన్ గుఢాచార సంస్థ ఐఎస్ఐ సపోర్టు ఇస్తున్నట్లు గుర్తించారు. టెర్రరిస్టుల సాయంతో డ్రోన్ల ద్వారా భారత్ కు ఆయుధాలను పంపించినట్లు గుర్తించారు.