Danger Pool: సముద్రాల్లో డెత్ పూల్స్.. అందులోకి వెళితే ఇంక అంతే సంగతులు..?

అయితే మనకు భూమిపై సముద్రాలు, మహా సముద్రాలు,నదులు ఉన్నట్టుగానే అక్కడక్కడ చిన్నచిన్న సరస్సులు,

  • Written By:
  • Publish Date - July 23, 2022 / 07:30 AM IST

అయితే మనకు భూమిపై సముద్రాలు, మహా సముద్రాలు,నదులు ఉన్నట్టుగానే అక్కడక్కడ చిన్నచిన్న సరస్సులు, చెరువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే సరస్సులు కేవలం భూమి పైన మాత్రమే కాకుండా సముద్రాల్లో కూడా అడుగుభాగాల్లో చిన్న చిన్న సరస్సులుగా ఉంటాయి. అయితే సముద్రం అడుగు భాగంలో ఉండే ఆ సరస్సులు చాలా ప్రమాదకరమైనవి. ప్రాణం ఉన్న ఏ జీవి, నీటిలో నివసించే జలచరమైన ఆ చిన్నపాటి సరస్సుల్లోకి ప్రవేశించాయి అంటే ప్రాణాలు పోయినట్టే లెక్క. అంత భయంకరమైనగా ఉంటాయి సముద్రంలోని ఆ చిన్నపాటి సరస్సులు. అత్యంత గాఢమైన లవణాలతో కూడిన ఈ సరస్సులను బ్రైన్ పూల్స్ లేదా డెత్ పూల్స్ అని కూడా అంటారు.

అయితే తాజాగా ఇలాంటి డెత్ పూల్ ను ఈజిప్ట్ సౌదీ అరేబియా మధ్యలోనే గల్ఫ్ ఆఫ్ అకాబా ప్రాంతంలో రెడ్ సి లేదా ఎర్ర సముద్రం అడుగున శాస్త్రవేత్తలు దానిని గుర్తించడం జరిగింది. సముద్రం అడుగున పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న జీవరాశులపై తాజాగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మయామి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. సముద్రంలో పైన నౌక నుంచి అడుగు భాగంలోకి రిమోట్ ద్వారా నడిచే అండర్ వాటర్ వెహికల్ పంపించి దాని ద్వారా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే గల్ఫ్ ఆఫ్ అకాబా ప్రాంతంలో ఉన్న ఈ డెత్ పూల్ ని గుర్తించడం జరిగింది. దాదాపుగా 1,770 అడుగులలో తన సముద్రపు నేలపై చిత్రంగా కనిపిస్తున్న ఆ పూల్ ను అండర్ వాటర్ వెహికల్ ద్వారా చూసి ఒకసారిగా ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు.

అందులో ఏముందో చూడటం కోసం ఆ వెహికల్ ని నీటిలోకి పంపించి శాంపిల్స్ ని పైకి తెప్పించుకొని పరిశీలించారు. అత్యంత ఎక్కువ స్థాయి లవణాలతో కూడిన ఈ చిన్నపాటి సరస్సు 40 మీటర్ల కన్నా వెడల్పు ఉంటుంది. అయితే ఆ చిన్నపాటి సరస్సులో ఆక్సిజన్ అసలే ఉండదు. అంత గాడత ఉన్న నీరు కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లే దానిలోకి ప్రవేశించే చేపలు కానీ లేదంటే ఇతర జరచరాలు గాని వెంటనే చనిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని పరిశోధనలు తేలింది. అలాగే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం విలువలోకి వచ్చింది. అంతటి భయంకరమైన పరిస్థితులను తట్టుకొని నిలబడగలిగే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆ డెత్ పూల్ లోనే నివసిస్తున్నట్లు ఆ నీటి శాంపుల్స్ లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే అనుకోకుండా ఆ డెత్ పూల్ లోకి వచ్చి చనిపోయిన జరచరాలను తింటూ బతుకుతూ ఉంటాయని వారు వివరించారు.