Site icon HashtagU Telugu

Bihar : తనను తాను కాల్చుకుని CRPFకానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం..!

Bihar

Bihar

బీహార్ లోని గయా జిల్లాలో విషాదం నెలకొంది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనను గుర్తించిన అధికారులు కానిస్టేబుల్ ను అసుపత్రికి తరలించారు. గయా జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ఇమామ్‌గంజ్ బ్లాక్‌లో CRPF 159 బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా చోటూలాల్ జాట్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

కాల్పుల శబ్దం విని…ఇతర సిబ్బంది పరిగెత్తి వెళ్లారు. రక్తంమడుగులో పడిఉన్న జాట్ ను గుర్తించారు. బెటాలియన్ కమాండెంట్ సమీర్ కుమార్ మాట్లాడుతూ, “మేము అతన్ని గయాలోని అనుగ్రహ్ నారాయణ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చాము. తరువాత అతన్ని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశాము. అతని పరిస్థితి విషమంగా ఉంది.”

” జాట్ ఎందుకు ఇంత కఠినమైన చర్య తీసుకున్నాడో దాని వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అతను స్పృహలోకి వచ్చిన వెంటనే మేము అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాము” అని ఆయన చెప్పారు.

Exit mobile version