Munugode : మునుగోడులో హస్తం పార్టీ పరిస్థితి ఏంటీ?…ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు..!!

మునుగోడులో హస్తంపార్టీ పరిస్థితి ఎలా ఉంది. పాపం అయోమయంగా ఉందంటున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని ఆరాటపడిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 06:40 AM IST

మునుగోడులో హస్తంపార్టీ పరిస్థితి ఎలా ఉంది. పాపం అయోమయంగా ఉందంటున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలని ఆరాటపడిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పార్టీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. చివరకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్ల కాళ్లు పట్టుకుని బతిమిలాడుకుంటున్నారు. అయితే ఈ పనిని నేతలు చేయడంలేదు. ఎన్ఎస్ యూఐ సభ్యులు, యూత్ కాంగ్రెస్ కార్యర్తలకు ప్రచారం అప్పగించి చేతులు దులుపుకున్నరు . ఇక పోటీలో నిలబడిన అభ్యర్థికి ప్రచారం చేయడం ఎలాగు తప్పదు కాబట్టి..గడప గడపకు తిరుగుతూ పాల్వాయి స్రవంతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ కాళ్లు పట్టుకుని ఓటెయ్యండంటూ కాంగ్రెస్ నేతలు అడుగుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా గెలుపే లక్ష్యంగా వినూత్న ప్రచారం చేస్తోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పాల్వాయి స్రవంతి గాజులు తొడిగి, బొట్టు పెడుతూ ఓటర్లను ప్రాదేయపడుతున్నారు. మిగతా కార్యకర్తలు కాళ్లు మొక్కే ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆదివారం చౌటుప్పల్ ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. మొత్తం లక్షమంది కాళ్లు మొక్కాని టార్గెట్ పెట్టుకున్నారు. బడానేతలంతా చడి చప్పుడు లేకుండా ఉంటే…యూత్ కాంగ్రెస్ నాయకుల్ని పంపించి కాళ్లు మొక్కించడం చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.

ఇక పాల్వాయి స్రవంతిపై కాస్త సింపతీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒంటరిపోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రావనే ఆలోచనలో ఉన్నారు. కానీ అక్కడి పరిస్థితి మాత్రం పాల్వాయి స్రవంతి ఛాన్స్ ఇచ్చేటట్లు కనిపిస్తోంది. ఈ టాక్ బలంగా వినిపిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ లను పోల్చిచూస్తే స్రవంతే బెస్ట్ అనే ఆప్షన్ కూడా స్థానికులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మునుగోడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో.