Site icon HashtagU Telugu

Viral Video : దటీజ్ దీదీ , నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి పకోడీలు వేసి షాకిచ్చిన సీఎం మమత..!!!

Mamata

Mamata

ఎప్పుడూ గంభీరంగా కనిపించే పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ…అప్పుడప్పుడు సరదాగా కూడా ఉంటారు. ఇవాళ ఝరాగ్రామ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దీదీ వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న దీదీకి మార్గమధ్యలో ఓ టీస్టాల్ కనిపించింది. వెంటనే తన కాన్వాయ్ ఆపారు. టీస్టాల్ లోకి వెళ్లి పకోడి వేశారు. అక్కడున్న జనాలకు తానే స్వయంలో పేపర్ లో పకోరాలు వడ్డించారు. దీంతో దుకాణం వద్ద సందడి నెలకొంది. అంతకు ముందు కూడా బెంగాల్లోని జార్ గ్రామ్ జిల్లాలో సీఎం మమత డ్రమ్ వాయిస్తూ కనిపించారు. మమతాబెనర్జీ ఇలా చేయడం ఇదేమీ కొత్త కాదు. ఇలా చాలా సార్లు సామాన్యల మధ్య గడపడం గతంలో చాలా సార్లు కనిపించింది.

ఇక ఝరాగ్రామ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా గిరిజనుల భూమిని ఎవరూ లాక్కేలేరని కేంద్రంపై పరోక్షంగా మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం అభివ్రుద్ధికి నిధులు ఇవ్వవద్దని కొందరు ఢిల్లీకి లేఖలు రాశారని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వ దౌర్జన్యాలను డోలు, బాణాలు, విల్లంబులతో ఎదురించాలని ప్రజలకు సూచించారు.