Dinosaurs Extinction : 10 కిలోమీటర్ల బాహుబలి ఆస్టరాయిడ్.. డైనోసార్లను మింగేసింది అదేనట!!

డైనోసార్ల అంతం ఒక మిస్టరీ..అవి ఎలా అంతం అయ్యాయి ? అనే చిక్కుముడి ఇప్పటిదాకా వీడలేదు.

  • Written By:
  • Publish Date - October 11, 2022 / 09:10 AM IST

డైనోసార్ల అంతం ఒక మిస్టరీ..అవి ఎలా అంతం అయ్యాయి ? అనే చిక్కుముడి ఇప్పటిదాకా వీడలేదు.. అయితే డైనోసార్ల యుగం అంతం కావడానికి సంబంధించి ఎన్నో థియరీలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

తాజాగా మరో కొత్త థియరీని ప్రతిపాదించారు. దాని ప్రకారం..  66 మిలియన్ సంవత్సరాల క్రితం దాదాపు 10 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న భారీ బాహుబలి గ్రహశకలం (ఆస్టరాయిడ్) భూమిని ఢీకొట్టింది. దీని దెబ్బకు భూమిపై చోటుచేసుకున్న విలయమే
డైనోసార్ల విలుప్తానికి దారి తీసిందట.  చిక్సులబ్ ప్రభావం భూమిపై భారీ భూకంపాన్ని ప్రేరేపించిందని కొత్త ఆధారాలు సూచిస్తున్నాయి. ఫలితంగా కొన్ని
వారాల నుండి నెలల వరకు భూ గ్రహాన్ని వణుకు వెంటాడిందని అంచనా వేశారు.ఈ ‘మెగా-భూకంపం’లో విడుదలైన శక్తి మొత్తం 1023 జౌల్స్ ఉంటుందని పేర్కొన్నారు. ఇది 2004 సంవత్సరంలో ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతంలో చోటుచేసుకున్న భూకంపంలో విడుదలైన శక్తి కంటే దాదాపు 50,000 రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు వివరించారు. అక్టోబర్ 9న అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన GSA కనెక్ట్స్ సమావేశంలో హెర్మాన్ బెర్ముడెజ్ అనే శాస్త్రవేత్త ఈ “మెగా-భూకంపం” యొక్క సాక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

శాస్త్రవేత్త బెర్ముడెజ్ 2014లో కొలంబియాలోని గోర్గోనిల్లా ద్వీపంలో ఫీల్డ్‌వర్క్ చేస్తున్నప్పుడు గోళాకార నిక్షేపాలను కనుగొన్నారు. చిన్న గాజు పూసలు (1.1 మిమీ పెద్దవి), ‘టెక్టైట్స్’ , ‘మైక్రోటెక్టైట్స్’ అని పిలవబడే ముక్కలతో నిండిన అవక్షేప పొరలు ఒక సమయంలో వాతావరణంలోకి విసర్జించబడ్డాయని.. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వల్లే ఇది జరిగిందని గుర్తించారు.గోర్గోనిల్లా ద్వీపం తీర సముద్రంలో సుమారు 2 కిమీ దిగువన లభ్యమైన రాళ్ళ శాంపిల్లు ఒక కథను చెబుతాయి. గ్రహశకలం ఢీకొనే సమయానికి .. అది ఢీకొనే ప్రదేశానికి నైరుతి దిక్కులో సుమారు 3,000 కిలోమీటర్ల దూరంలో ఇసుక, మట్టి, చిన్న సముద్ర జీవులు సముద్రపు అడుగుభాగంలో ఉన్నట్లు తేలింది.