Site icon HashtagU Telugu

Viral Video: మొదటిసారి బాదంను తిన్న ఉడుత.. రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!

Chipmunk

Chipmunk

అయితే ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అలాగే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో జంతువులను పక్షులను గమనిస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అవి చేసే చిలిపి పనులు, అల్లరి పనులను చూసి ఆస్వాదిస్తూ నవ్వుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా కుక్కలు, పిల్లి, అలాగే ఉడతలు, కోతులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలు చూస్తే ఎవరైనా అవ్వాల్సిందే అన్న విధంగా అవి తెలియకుండానే కామెడీ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాయి. ఇకపోతే మన ఇంటి వాతావరణం లో లేదా మనం ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు మనకు చెట్ల మీద టింగు టింగు మంటూ గెంతుతూ ఉడతలు కనిపిస్తూ ఉంటాయి.

ఆ ఉడతలు మనుషులను ఏదైనా జీవులను చూస్తే చాలు తుర్రమని పారిపోతూ ఉంటాయి. చాలామంది ఉడతలను తెగ ఇష్టపడుతూ ఉంటారు. వాటిని ఎలా అయినా ఒక్కసారి అయినా చేత్తో పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఉడతలు చేతికి చిక్కడం అన్నది చాలావరకు అసాధ్యమని చెప్పవచ్చు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ఉడతలు కూడా మనసులో ఉన్న ప్రదేశానికి ధైర్యంగా వచ్చి మనుషులు పెట్టే తిండి తిని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఉంటాయి. ఇలా మనుషులు ముడతలకు ఆహారం తినిపించే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

 

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కానీ ఆ వీడియోలో ఉడత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. ఒక అతను చేతిలో బాదంను పట్టుకొని ఉండగా ఇంతలో ఒక ఉడత అక్కడికి వచ్చి అతని చేతిలో ఉన్న ఒక బాదం ను తీసుకొని తింటుంది. అయితే మొదటిసారి బాదం తిన్న ఉడత ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ను ఇస్తుంది. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న నాలుగేదు బాదం లను తీసుకుని దాన్ని దవడలో పెట్టుకుంటుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మొదటిసారి బాదం తిన్న ఉడతా అన్న క్యాప్షన్ ను జోడించారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఉడత వీడియోని మీరు కూడా చూసి హాయిగా నవ్వుకోండి.